Begin typing your search above and press return to search.

తొలి రోజు 9 కోట్లు కొల్లగొట్టింది

By:  Tupaki Desk   |   10 Oct 2015 9:25 AM GMT
తొలి రోజు 9 కోట్లు కొల్లగొట్టింది
X
టాక్ కొంచెం డివైడ్ గానే ఉన్నప్పటికీ ‘రుద్రమదేవి’ తొలి రోజు అదరగొట్టింది. బిగ్ స్టార్స్ సినిమాలకు ఏమాత్రం తక్కువ కాని రీతిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ.9 కోట్లకు పైగా షేర్ రావడం విశేషం. గ్రాస్ రూ.12 కోట్ల దాకా వచ్చింది. ఓవర్సీస్ - ఇండియాలోని మిగతా రాష్ట్రాల్లో కలిపితే ఇంకో రూ.3 కోట్ల దాకా షేర్ కలెక్టయి ఉండొచ్చని అంచనా.

తొలి రోజు నైజాం ఏరియాలో రూ.3.5 కోట్ల దాకా షేర్ వచ్చినట్లు అంచనా. ఇక్కడ దిల్ రాజు రూ.12 కోట్లకు ‘రుద్రమదేవి’ హక్కులు కొన్నాడు. సీడెడ్ ఏరియాలో రూ.1.55 కోట్ల షేర్ వచ్చింది. ఉత్తరాంధ్రలో రూ.67 లక్షలు వసూలయ్యాయి. గుంటూరులో ఒక్క రోజుకే రూ.కోటి రూపాయలకు పైగా షేర్ రావడం విశేషం. అక్కడ రూ.1.05 కోట్లు వచ్చాయి. తూర్పు గోదావరిలో రూ.81 లక్షలు - పశ్చిమ గోదావరిలో రూ.66 లక్షలు - నెల్లూరులో రూ.47 లక్షలు - కృష్ణాలో రూ.47 లక్షలు వసూలయ్యాయి.

మొత్తం ఏపీ వరకు రూ.5.68 కోట్లు కొల్లగొట్టింది రుద్రమదేవి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపితే లెక్క రూ.9.18 కోట్లు తేలింది. ఓవర్సీస్ - మిగతా రాష్ట్రాల్లో తెలుగు వెర్షన్ ఎంత వసూలు చేసింది ఇంకా క్లారిటీ రాలేదు. ఇది కాక హిందీ, మలయాళ వెర్షన్ల లెక్కలు కూడా తేలాల్సి ఉంది. తమిళ వెర్షన్ వారం తర్వాత విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇదే ఊపు వారమంతా కొనసాగితే ‘రుద్రమదేవి’ బయటపడే అవకాశముంది. తొలి మూడు రోజుల్లో రుద్రమదేవి తెలుగు వెర్షన్ పాతిక కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసే అవకాశముంది.