Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కొత్త విలన్ ఇతడే..

By:  Tupaki Desk   |   27 Jun 2017 7:02 AM GMT
ఎన్టీఆర్ కొత్త విలన్ ఇతడే..
X
తెలుగు సినిమాల్లో విలన్లు ఎప్పటికప్పుడు బోర్ కొట్టేస్తుంటారు. ముంబయి నుంచో.. పొరుగు భాషల నుంచో కొత్త విలన్ ను తీసుకురావడం.. ఆరంభంలో ఆ విలన్ కొత్తగా కనిపించడం.. తర్వాత వరుసగా అవకాశాలు అందుకోవడం.. కొన్నాళ్లకే బోర్ కొట్టేసి సైడైపోవడం.. మళ్లీ కొత్త విలన్ ఎంట్రీ ఇవ్వడం.. ఇది టాలీవుడ్లో షరామామూలే. కమర్షియల్ సినిమాల కథల మాటెలా ఉన్నా విలన్ల విషయంలో మాత్రం మార్పు చూపించే ప్రయత్నం చేస్తుంటారు మన దర్శకులు. ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’ చేస్తున్న కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సినిమా కోసం బాబీ బాలీవుడ్ నుంచి ఓ కొత్త విలన్ ను పట్టుకొచ్చాడు. అతడి పేరు రోనిత్ రాయ్.

ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘కాబిల్’ సినిమా చూసిన వాళ్లకు రోనిత్ రాయ్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆ సినిమాలో అదిరిపోయే విలనీతో ఆకట్టుకున్నాడు రోనిత్. దీంతో పాటు ఉదాన్.. అగ్లీ లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాల్లోనూ మెప్పించాడు రోనిత్. అతనే ‘జై లవకుశ’లో ఎన్టీఆర్ విలన్. ఎన్టీఆర్ సినిమాతో దక్షిణాది పరిశ్రమకు పరిచయం కాబోతుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు రోనిత్. తారక్ మీద అతను ప్రశంసలు కురిపించాడు. ‘‘ఎన్టీఆర్ గొప్ప వ్యక్తే కాదు.. ఎంతో ఏకాగ్రత ఉన్న నటుడు. అందరూ ఇష్టపడే.. ఎంతో గౌరవించే అలాంటి నటుడి సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుండటం నా అదృష్టం. ‘జై లవకుశ’లో నా పాత్ర ఎలాంటి షేప్ తీసుకుంటుందో... దానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని రోనిత్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/