Begin typing your search above and press return to search.

బాలీవుడ్ విలన్ తో ఎన్టీఆర్ ఫైటింగ్

By:  Tupaki Desk   |   22 Jun 2017 11:31 AM GMT
బాలీవుడ్ విలన్ తో ఎన్టీఆర్ ఫైటింగ్
X
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీని.. దర్శకుడు బాబీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. యంగ్ టైగర్ కెరీర్ లోనే బెస్ట్‌ గా నిలిచిపోయేలా జాగ్రత్త పడుతున్నాడు బాబీ.

జై లవ కుశ టైటిల్ పై రూపొందుతున్న ఈ మూవీలో.. ఇప్పుడు విలన్ ను ఫైనలైజ్ చేశారు. ఉదాన్.. అగ్లీ వంటి చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ ను విలన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోనిత్ రాయ్ షూటింగ్ కూడా ప్రారంభించేయగా.. హైద్రాబాద్ పరిసరాల్లోని ఓ క్వారీలో ప్రస్తుతం భారీ యాక్షన్ సీక్వెన్స్ రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్- రోనిత్ రాయ్ ల మధ్య హై ఓల్టేజ్ ఫైటింగ్ జరుగుతోందట. మొదట ఈ పాత్ర కోసం కన్నడ నటుడు దునియా విజయ్ ను తీసుకోవాలని భావించారు. అయితే.. ఈ పాత్రకు రోనిత్ అయితే కరెక్ట్ గా సరిపోతాడనే ఉద్దేశ్యంతో.. చివరి నిమిషంలో ఇతడిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ తో పాటు ఇతని పాత్రకు కూడా ప్రోస్థటిక్ మేకప్ ఉంటుందని.. విభిన్నమైన గెటప్ లో కనిపించనున్నాడని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అందాల భామలు రాశి ఖన్నా.. నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. సెప్టెంబర్ తొలివారంలో మూవీని రిలీజ్ చేసే టార్గెట్ తో యూనిట్ వర్క్ చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/