Begin typing your search above and press return to search.

‘రోజులు మారాయి’ అంటున్న మారుతి

By:  Tupaki Desk   |   30 April 2016 7:30 AM GMT
‘రోజులు మారాయి’ అంటున్న మారుతి
X
మారుతి అంటే పేరు కాదు.. అదొక బ్రాండ్. చాలా తక్కువ సమయంలోనే అతను సినీ పరిశ్రమలో చాలామంది గాడ్ ఫాదర్ అయిపోయాడు. ఎంతో మంది కొత్త నటీనటులకు.. టెక్నీషియన్లకు అవకాశాలిచ్చాడు. తన నిర్మాణంలో చాలా సినిమాలు తీశాడు. కొన్ని సినిమాలకు స్వయంగా తనే స్క్రిప్టు కూడా సమకూర్చాడు. ఆ కోవలోనే మారుతి నుంచి రాబోతున్న కొత్త సినిమా.. రోజులు మారాయి. దిల్ రాజు-మారుతి కలిసి ‘ఈరోజుల్లో..’ సినిమా తీసిన గుడ్ సినిమా గ్రూప్ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే మారుతీనే అందించాడు.

‘రోజులు మారాయి’తో మురళీకృష్ణ ముదిరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చేతన్ అనే కొత్త కథానాయకుడు ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమవుతుండగా.. తేజస్వి మదివాడతో పాటు దృశ్యం-వినవయ్యా రామయ్యా సినిమాల ఫేమ్ కృతిక జయకుమార్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ‘కేరింత’ సినిమాతో మంచి పేరు సంపాదించిన పార్వతీశం కూడా ఓ ముఖ్య పాత్ర పోషించాడు. టైటిల్ పాతగా అనిపిస్తున్నప్పటికీ.. ఈ సినిమా పోస్టర్లు మాత్రం కొత్తగా కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో అమ్మాయిలకు స్పీడెక్కువైందని.. అబ్బాయిలు బుద్ధిమంతులైపోయారనే ఇండికేషన్ ఇస్తున్నట్లుగా పోస్టర్లు డిజైన్ చేశారు. మారుతి ప్రొడక్షన్లో వచ్చే అన్ని సినిమాలకూ పని చేసే జె.బి.నే ఈ సినిమాకు కూడా సంగీతాన్నందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ఆడియో విడుదల కాబోతోంది.