Begin typing your search above and press return to search.

మహేష్ కోసం కదిలొచ్చిన రోజా

By:  Tupaki Desk   |   26 Sep 2017 5:33 AM GMT
మహేష్ కోసం కదిలొచ్చిన రోజా
X
తెల్లారితే చాలు మహేష్ బాబు మూవీ స్పైడర్ రిలీజ్ పండుగ. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఫుల్లు హంగామా నడుస్తోంది. మన దగ్గర అయితే.. తెల్లారే వరకూ ఆగాలి కానీ.. పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం నుంచే ప్రీమియర్స్ పడిపోతాయి. సోషల్ మీడియా పుణ్యమా అని.. దాదాపు అర్ధరాత్రి సమయానికే స్పైడర్ సంగతులు చాలానే బయటకు వచ్చేస్తాయి.

వాళ్లూ వీళ్లూ చెప్పే సంగతులు ఏమో కానీ.. అవే కబుర్లను స్వయంగా సూపర్ స్టార్ చెబుతుంటే.. వినేందుకు మరింత సూపర్ గా ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కూడా మరింత స్పెషల్ అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు సాక్షి న్యూస్ ఛానల్ కూడా ఇదే ప్రయోగం చేస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. టీవీ కార్యక్రమాల్లో అలరిస్తూ ఉంటారు. ఈ మాజీ హీరోయిన్ తో.. మహేష్ బాబు ఇంటర్వ్యూ రికార్డ్ చేశారు. త్వరలోనే ఈ కార్యక్రమం టెలికాస్ట్ కానుంది కూడా. అటు ఫిలిం ఇండస్ట్రీలోను.. ఇటు పాలిటిక్స్ లోను ఫుల్ యాక్టివ్ గా ఉండే రోజా.. మహేష్ బాబును ఇంటర్వ్యూ చేయడం అనే టాపిక్కే చాలామందికి ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు మహేష్ కూడా ఇలాంటి స్పెషల్ ఇంటర్వ్యూలకు బాగా కేర్ తీసుకుంటాడు.

ఇలా రోజాతో ఇంటర్వ్యూలు చేయించడం సాక్షి ఛానల్ కు కొత్తేమీ కాదు. విపరీతమైన బజ్ ఉన్న సినిమాలకు ఇలాంటి డిఫరెంట్ ప్రయోగాలు చేస్తుంటుందా ఛానల్. మెగాస్టార్ రీంఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 విషయంలో కూడా చిరు- రోజా ఇంటర్వ్యూ సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే.