Begin typing your search above and press return to search.

సుడిగాలి సుధీర్‌ కు అలా షాకిచ్చిన రోజా!

By:  Tupaki Desk   |   27 Oct 2016 10:24 AM GMT
సుడిగాలి సుధీర్‌ కు అలా షాకిచ్చిన రోజా!
X
జబర్ధస్త్ ప్రోగ్రాం గురించి చాలా మందికి తెలిసిన విషయమే. ఈ కార్యక్రమంలో నటీనటులకు ఎంత పేరుందో అంతకు మించి జడ్జిలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా లకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పేరుంది. ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే తాజాగా ఒక కార్యక్రమానికి నాగబాబు, రోజాలు అతిధులుగా హాజరయ్యారు. ఆ సందర్భంలో ఎమ్మెల్యే రోజా చేసిన ఒక పని అక్కడున్న వారికి, ఆ కార్యక్రమం చూసిన వారికి అద్భుతమైన హాస్యాన్ని పండించింది.

విషయానికొస్తే... నాగబాబుతో కలిసి "నా షో నా ఇష్టం" కార్యక్రమానికి రోజా అతిథిగా వెళ్లారు. అక్కడ జబర్దస్త్ ఫేం సుడిగాలి సుధీర్‌ కు ఫోన్ చేసిన రోజా అమ్మాయి పేరుచెప్పి భయపడేలా చేశారు. "ఎవరో ఒక అమ్మాయి.. నువ్వు మోసం చేశావని వచ్చింది. మీ అమ్మానాన్నలను పిలిపించమంటోంది.. నేను క్లియర్ చేద్దామని నీకు కాల్ చేశాను.. నేను లైట్ తీసుకుంటే రేపు మీడియాలో వస్తుంది.. ఏమిచెయ్యమంటావో చెప్పు" అంటూ రోజా ఝలక్ ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడంతా నవ్వుల పువ్వులు పూశాయి. అయితే ఈ సందర్భంగా స్పందించిన సుధీర్... "అసలు విషయం ఏంటో తెలీదు కదా మేడమ్, అసలు ఆమె పేరు ఏమిటి... అయినా నాకు గల్ర్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు" అంటూ దీనంగా సమాధానమిచ్చాడు.

"కామెడీ కాదు సీరియస్‌గా చెబుతున్నా.. లాస్ట్ టైం రోడ్డు మీద గొడవ అయినప్పుడు ఛానల్స్‌ లో రాకుండా నేనే కదా ఆపిచ్చాను.. ఇప్పుడు మళ్లీ అలాంటి సందర్భం వచ్చింది.. అసలే ఇది అమ్మాయి విషయం.. నీకు తెలుసు కదా సుధీర్ నేనెప్పుడూ అమ్మాయిలకు సపోర్ట్ గా ఉంటాను.." అని రోజా కాస్త సీరియస్ వాయిస్ తో ఝులక్ ఇవ్వడంతో కంగారు పడిన సుధీర్ కి మైండ్ బ్లాక్ అయ్యిందనే చెప్పాలి.

ఇది సరదాగా చేసిన కాల్ అని, ఇలా కాల్ చేసి మాట్లాడటం కార్యక్రమంలో ఒక భాగమని తెలుసుకున్నాక సుధీర్ ఊపిరి తీసుకున్నంత పనిచేశాడు. అనంతరం... "తనకు రెండు నిమిషాలపాటు గుండె ఆగినంతపనైందని, ప్యాంటు తడిసిపోయిందని" భయంతో చెప్పాడు సుధీర్. ఈ సీన్ జరుగుతున్నంత సేపు ప్రేక్షకులు మాత్రం కడుపుబ్బా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/