అబ్బే.. ఆర్తి అగర్వాల్ తో ఎఫైర్ లేదు

Fri Apr 21 2017 10:41:55 GMT+0530 (IST)

లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న తరుణ్.. యూత్ లో బోలెడంత ఫాలోయింగ్ ఉన్న ఆర్తి అగర్వాల్.. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ అప్పట్లో చాలానే గుసగుసలు వినిపించాయి. ఒకానొక టైంలో ఆర్తి ఆస్పత్రిలో చేరడానికి కారణం.. ఆమె విషం తాగేయడమే. దీనికి కూడా తరుణ్ తో బేధాభిప్రాయాలనే మాటలు వినిపించాయి.

తరుణ్ తల్లి.. సీనియర్ యాక్ట్రెస్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన రోజా రమణి.. కొడుకుపై వచ్చిన రూమర్స్ కు స్పందించారు. 'వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని నాకు తెలుసు. నువ్వు లేక నేను లేను 100 డేస్ ఫంక్షన్ లో ఆర్తితో ఒక్కసారి మాట్లాడానంతే. తను చాలా మంచి అమ్మాయి. ఆమె ఎందుకు విషం తాగిందనే సంగతి.. మీడియాకి బాగా తెలుసు. తరుణ్ తో రిలేషన్ షిప్ గురించి అయితే మాత్రం అసలు కాదు' అని చెప్పి రోజారమణి.. వాళ్లిద్దరు మేజర్స్ అని.. మంచి సంపాదనపరులైన తరుణ్-ఆర్తి అగర్వాల్ లు పెళ్లి చేసుకోవాలని భావిస్తే.. ఎవరు ఆపగలరని నిలదీశారు.

'నిజంగా వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే.. మా సపోర్ట్ ఉన్నా లేకున్నా చేసుకునేంతటి స్థాయి వారికి ఉంది. నిజంగా ప్రేమించి ఉంటే.. మా అబ్బాయి మాకు ఈ విషయం చెబితే.. మేమైనా పెళ్లి చేసేవాళ్లం. కానీ వారి మధ్య అలాంటిదేమీ లేవు. అవన్నీ రూమర్స్ మాత్రమే. తను వేరే పెళ్లి చేసుకుంది కదా. తరుణ్ తో ప్రేమలో ఉంటే.. పెళ్లి చేసుకునేది కాదు కదా' అంటూ తన వాదనను సరిగానే వినిపించారు రోజా రమణి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/