చిరును ఇంటర్వ్యూ చేసిన రోజా

Tue Jan 10 2017 13:53:16 GMT+0530 (IST)

రోజా అంటే ఓ ఫైర్ బ్రాండ్. ఆమె వాగ్ధాటి భలే ఉంటుంది. రాజకీయాల్లోకి వెళ్లాక మాట్లాడటంలో మరింత రాటుదేలింది.  అవతలివాళ్లు ఎంతటివాళ్లయినా సరే తాను చెప్పాలనుకొన్నది ఓపెన్ గా ఇట్టే చెప్పేస్తుంది.  చిరంజీవి ప్రజారాజ్యం పెట్టాక ఓ రాజకీయ నాయకురాలిగా రోజా ఆయనపై కూడా  తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఒకానొక దశలో రాజకీయాల్లో చిరంజీవి వర్సెస్ రోజా అన్నట్టుగా వాతావరణం కనిపించింది. అప్పట్నుంచి చిరంజీవికీ - రోజాకీ మధ్య వార్ నడుస్తున్న భావన బయటి జనాల్లో కనిపించింది.అయితే వాళ్లిద్దరి మధ్య రాజకీయ వైరుధ్యాలే తప్ప వ్యక్తిగతంగా మాత్రం ఇప్పుడు కూడా మంచి ఈక్వేషన్స్‌తో ఉన్నారు. ఆ విషయం తాజాగా మరోసారి బయట పడింది. చిరు 150వ చిత్రం కోసం రోజా టీవీ హోస్ట్‌గా మారింది. ఓ ఛానల్ కోసం చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది రోజా.  ఆ ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా ఉంటుందట. త్వరలోనే టెలికాస్ట్ కాబోతోందని చిత్రబృందం చెబుతోంది. అన్నట్టు చిరు రోజా కలిసి మూడు చిత్రాల్లో నటించారు. ఆ మూడూ కూడా చక్కటి ఆదరణ పొందినవే. చిరు తమ్ముడు నాగబాబుతో కలిసి జబర్దస్త్‌కి జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. జబర్దస్త్ నుంచి రోజా మెగా కుటుంబానికి మరింత క్లోజ్ అయిందని బయట ప్రచారం జరుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/