Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: కథ పాతదే.. అయినా రాకింగ్

By:  Tupaki Desk   |   25 Oct 2016 4:26 AM GMT
ట్రైలర్ టాక్: కథ పాతదే.. అయినా రాకింగ్
X
ఎనిమిదేళ్ల క్రితం రాక్ ఆన్ మూవీ బాలీవుడ్ లో బోలెడంత సెన్సేషన్. కలెక్షన్స్ విషయంలో మరీ బాక్సులు బద్దలైపోకపోయినా.. పర్లేదనే స్థాయిలోనే వచ్చాయి. కానీ రాక్ఆన్ సినిమాకి.. అందులో నటులకు.. అన్ని యాంగిల్స్ లోను బోలెడన్ని ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడా సినిమాకి సీక్వెల్ రాక్ ఆన్2 థియేటర్లలోకి వచ్చేస్తోంది.

గత వారంలో యాక్టర్స్.. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కలిసి లైవ్ కాన్సర్ట్ ఇచ్చి మరీ రాక్ ఆన్2 ఆడియో రిలీజ్ చేయగా.. ఇప్పుడీ చిత్రానికి ట్రైలర్ ను లాంఛ్ చేశారు. సో సింపుల్ గా చెప్పాలంటే.. టైటిల్ కు తగ్గట్లుగానే రాకింగ్ అనాల్సిందే. సింగర్ గా సత్తా చాటేందుకు ప్రయత్నించే.. ఓ స్టేజ్ ఫియర్ ఉన్న అమ్మాయిగా శ్రద్ధా కపూర్ నటన చాలా బాగుంది. మాజిక్ బ్యాండ్ తో కలిసి ట్యాలెంట్ చూపించేస్తోంది. ఫరాన్ అక్తర్ ని గతం వెంటాడుతూ ఉండగా.. ప్రస్తుతంకూడా భయపెడుతూ ఉంటుంది. ఓవరాల్ గా స్టోరీ అయితే రాక్ ఆన్ మూవీకి మాదిరిగానే ఉన్నా.. ట్రైలర్ వరకూ మాత్రం అంతకు మించి ఆకట్టుకోవడం ఖాయం.

అర్జున్ రాంపాల్.. ఫర్హాన్ అక్తర్.. శ్రద్ధా కపూర్.. శశాంక్ అరోరాలు సూపర్బ్ గా ఆకట్టుకున్నారు. ఫస్ట్ పార్ట్ కంటే కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది రాక్ ఆన్2 ట్రైలర్. మరి మూవీ కూడా అదే రేంజ్ లో ఉంటుందో లేదో తెలియాలంటే నవంబర్ 11న రిలీజ్ డేట్ వరకూ ఆగాల్సిందే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/