2.0 మళ్లీ పోస్ట్ పోన్ అయింది!!

Fri Apr 21 2017 22:30:03 GMT+0530 (IST)

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 2.0. రోబో సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి కానీ.. ఈ సినిమా రిలీజ్ అంతకంతకూ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. మొదట ఈ మూవీని ఈ సమ్మర్ కే రిలీజ్ చేస్తామని అన్నారు మేకర్స్.

అయితే.. సమ్మర్ టైట్ అయిపోవడం.. మరోవైపు మూవీ వర్క్ చాలా పెండింగ్ ఉండడం.. మధ్యలో రజినీకాంత్ అనారోగ్యం వంటి కారణాలతో.. షూటింగ్ వాయిదాలు పడింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఈ ఏడాది దీపావళికి సినిమా రిలీజ్ వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఆ డేట్ కు రావడం కూడా కష్టమనే విషయం తేలిపోయింది. దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఈ చిత్రం.. ఇప్పుడు వాయిదా పడ్డం ఖాయంగా తేలిపోయింది. మూడు నెలలకు పైగా వాయిదా వేసుకుని.. రోబో సీక్వెల్ ను వచ్చే ఏడాదికి పంపేశారు. రిపబ్లిక్ డే వీకెండ్ సందర్భంగా.. జనవరి 25న గురువారం రోజున విడుదల చేయబోతున్నామని అనౌన్స్ చేశారు.

ఇందుకు గ్రాఫిక్స్ వర్క్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఇది రజినీ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అయినా.. శంకర్ పర్ఫెక్షన్ గురించి తెలిసే ఉండడంతో.. ఆయన మూవీస్ టెక్నికల్ గా ఎలాంటి హై స్టాండర్డ్స్ ఉంటాయో తెలియడంతో.. వెయిట్ చేయక తప్పని పరిస్థితి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/