పెళ్లయ్యాక కూడా ఈ లిప్ లాక్స్ ఏంటో

Tue Sep 12 2017 17:08:38 GMT+0530 (IST)

వెండితెరపై ఎంతో అందంగా కనిపించే కొందరు హీరోయిన్లు అనవసరంగా కొన్ని వివాదాల్లో చిక్కుకొని ఇబ్బందుల్లో పడతారు. సెలబ్రెటీ హోదాలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్టార్స్ ఒక్కసారి అడ్డంగా బుక్ అయితే మళ్లీ కోలుకోవడానికి చాలా కాలమే పడుతుంది. దీంతో తప్పటడుగులు వేసేటప్పుడు తారలు చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ కొందరు అనుకోకుండా ఒక్కోసారి కెమెరా కంట చిక్కి ఇబ్బందుల పాలవుతారు. తర్వాత అది నేను కాదు అని మీడియా మీద అరుస్తూ ఉంటారు.ఇలాంటి వివాదాలను ఎన్నో చుసిన బాలీవుడ్ భామ రియా సేన్ ఏమనుకుందో ఏమో గాని డైరెక్ట్ గా పబ్లిక్ లో లిప్ కిస్ తో దర్శనమిచ్చింది.  ముద్దు పెట్టింది భర్తకే అయినా నలుగురు చూస్తుండాగా ముద్దు పెట్టి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అంతటితో ఉరుకుందా అంటే అది కాదు ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇంకాస్త హల్ చల్ చేసింది. గత నెల శివమ్ తివారి తో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ఈ భామ సంచలనం సృష్టించింది. బాలీవుడ్ లో ఆమెకు ఎంతోమంది సన్నిహితులు ఉన్నా వివాహానికి పిలవకుండా ఓ స్టార్ హోటల్ లో నాలుగు గోడల మధ్య పెళ్లి చేసుకుంది. అమ్మడు గతంలో సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావులే. ఇరవై దాటకముందే లవ్ స్టోరీలను బాగానే నడిపిందని ఒక టాక్ ఉంది. అలాగే వివాదాలను కూడా బాగానే మూటగట్టుకుంది.

అయితే శివమ్ తో ఏడాది నుంచి డేటింగ్ లో ఉన్నందున ప్రెగ్నెన్సీ వచ్చిందని అందుకే పెళ్లి చేసుకుందని వార్తలు వినిపించాయి. మొత్తానికైతే పెళ్లి చేసుకుందిగాని పాత పద్ధతులు మాత్రం ఇంకా మానలేదు అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే  ఫోటో చూడడానికి రొమాంటిక్ గానే ఉన్నా ఇలా పబ్లిక్ లో లిప్ లాక్ ఇచ్చి తన ప్రేమను చాటుకోవాలా అని కూడా అంటున్నారు.