ఫోటో స్టొరీ: మైండ్ బ్లోయింగ్ గ్లామర్

Sat Jun 15 2019 13:13:02 GMT+0530 (IST)

రియా సేన్ ఎవరో మీకు తెలిస్తే సరి. తెలియకాపోతే కాస్త ఓపిక చేసుకొని ఒంటరిగా ఎఎల్టీ బాలాజీ వారి జిల్లనిపించే హాట్ వెబ్ సీరీస్ 'రాగిణి ఎంఎంఎస్:రిటర్న్స్' ను చూస్తే చాలు. అమ్మడి హాట్ నెస్ & బోల్డ్ నెస్ మీకు అర్థం అవుతుంది.  పై ఫోటోను చూసి పాతికేళ్ళ భామేమో అని మీరు పొరపాటు పడే అవకాశం ఉంది.  కాదు బాబోయ్ కాదు .. పాపలా కనిపించే ఈ భామ వయసు 38 ఏళ్ళు. మన జనాలు రోజూ లిక్కర్ తాగుతూ ప్రపంచ సమస్యల గురించి చర్చించినట్టు.. ఈ భామ అమృతం తాగుతూ మెడిటేషన్ చేస్తోందేమో! లేకపోతే అంత అందం ఎలా ఉంటుంది?ఇంతకీ రియా సేన్ ఎవరంటే సుచిత్రా సేన్ మనవరాలు.  మూన్ మూన్ సేన్ కూతురు.   బాలీవుడ్ నుండి మొదలు పెడితే సౌత్ సినిమాలవరకూ దాదాపు నలభై సినిమాల్లో నటించింది. ఇప్పుడు శివం తివారి అనే వ్యక్తిని పెళ్ళి చేసుకొని సెటిల్ అయింది. శ్రీమతి అయినప్పటికీ .. ఆమెకు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో మంటలు పెట్టడం ఫేవరెట్ హాబీ.  తాజాగా ఒక కలర్ ఫుల్ మొనోకిని ధరించింది ఫోటో షూట్ చేసింది.  పూల్ లో నిలబడింది.  ఒంపుసొంపుల వయ్యారాలను విస్తరాకు లాంటి కెమెరాకు వడ్డిస్తూ వెనక్కు తిరిగింది.  స్వచ్చమైన కొలను నీటిలో కులుకుతూ నిలబడిన అందమైన కలువ లాంటి భామను వర్ణించడానికి భాష సరిపోదు. ఆ ఒంపులకు తోడు రియా ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది.  పాలరాతి శిల్పం లాంటి ఈ భామ చూస్తే మనకు కాళ్ళు చేతులు ఆడేలా లేవు.. మరి ఆ ఫోటోగ్రాఫర్ తథాగత ఘోష్ ఎలా నిగ్రహించుకొని ఏకాగ్రతతో ఎలా ఫోటో షూట్ పూర్తి చేయగలిగాడో?  ఆయనకో పే..ద్ద దణ్ణం!

ఈ బెంగాలి రసగుల్లా ఈమధ్య 'మిస్ మ్యాచ్ 2' అనే  వెబ్ సీరీస్ లో కూడా నటిస్తోంది.  హిందీ.. బెంగాలి భాషల్లో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ హొయ్ చోయ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం లో చూడవచ్చు.