ఫోటో స్టోరీ : దీపావళి చిచ్చుబుడ్

Fri Nov 09 2018 18:43:23 GMT+0530 (IST)

మంచు మనోజ్ సరసన `నేను మీకు తెలుసా?`  చిత్రంలో నటించింది రియా సేన్. ఇదే చిత్రంలో క్యూట్ స్నేహా ఉల్లాల్ మరో కథానాయికగా ఆడిపాడింది. ఆ సినిమా ప్రమోషన్ లో ఉన్నంత కంటెంట్ సినిమాలో లేకపోవడంతో అది కథానాయికలకు మైనస్ అయ్యింది. అయితే తనదైన అందం వేడెక్కించే గ్లామర్ తో రియాసేన్ బాలీవుడ్ లో అడపాదడపా అవకాశాలు అందుకుంటూ.. తన స్థానం కాపాడుకుంటోంది. బాలీవుడ్ లో పలు టాప్ రేంజ్ సినిమాల్లో అవకాశాలు అందుకున్న ఈ అందగత్తె కెరీర్ పరంగా చాలా నెమ్మదించింది.ప్రఖ్యాత క్లాసిక్ నటి మున్ మున్ సేన్ వారసురాలిగా రియా సేన్ పాపులారిటీ తక్కువేమీ కాదు. అయితే తన రేంజు మాత్రం గ్లామర్ వరల్డ్ లో పెంచుకోవడంలో తడబడింది. 1991లోనే బాలనటిగా ఆరంగేట్రం చేసి అటుపై 2001లో కథానాయికగా మెరుపులు మెరిపించిన రియా ఈ 18ఏళ్ల జర్నీలో స్టార్ హీరోయిన్ గా మాత్రం వెలగలేకపోయింది. కారణం ఏదైనా ప్రస్తుతం రియా కెరీర్ అంతంత మాత్రమే.

2017లో`రాగిణి ఎంఎంఎస్` చిత్రంలో నటించింది. ఆ తర్వాత వేరొక సినిమాకి సంతకం చేసిందే లేదు. అయితే బ్రాండ్స్ తో మాత్రం నిరంతరం టచ్ లోనే ఉంటోంది. ప్రఖ్యాత లాక్మే బ్యూటీ ప్రొడక్ట్స్ ని రియా ప్రమోట్ చేస్తోంది. నిన్నటిరోజున దీపావళి సందర్భంగా రియా ఓ స్పెషల్ ఫోటోని అభిమానులకు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ ఫోటోలో మత్తెక్కించే చూపులతో అందాల్ని ఎంత అవసరమో అంతే ఆవిష్కరించి ఆకట్టుకుంది. ఇకపై మరోసారి సౌత్ లో గజినీలా దండయాత్ర చేస్తుందేమో?