Begin typing your search above and press return to search.

అడుగడుగునా అల్లర్లే.. చివరికి పెళ్లి కూడా

By:  Tupaki Desk   |   23 Aug 2017 12:30 AM GMT
అడుగడుగునా అల్లర్లే.. చివరికి పెళ్లి కూడా
X
ప్రస్తుత రోజుల్లో కొందరు తారలు సినిమాలతో కన్నా కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. అయితే ఈ మధ్యనే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ రియా సేన్ తన కెరీర్ లో ఎన్నో వివాదాలను కొని తెచ్చుకుంది. ఆమె కొన్ని సందర్భాల్లో వ్యవహరించిన తీరు అంతా ఇంతా కాదు. ఎన్నో ఫొటోలతో - ఎమ్మెమ్మెస్ లతో మీడియాలో నిలిచి హాట్ టాపిక్ గా మారింది. 1991లో చైల్డ్ ఆర్టిస్ట్ గా థన్ సినిమా లైఫ్ ని స్టార్ట్ చేసిన ఈ భామ అడుగడుగునా తన తప్పటడుగులతో వివాదాలనే కొని తెచ్చుకుంది. దీంతో ఆమె ఎటు వెళ్లినా మీడియా కంట పడేది.

రీసెంట్ గా ఆమె లైఫ్ లో సంబందించిన కొన్ని కాంట్రవర్సీలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. పబ్స్ లో యాక్టర్స్ కు ముద్దు పెట్టడం నుండి అంతర్జాతీయ క్రికెటర్స్ తో ఆమెకు రిలేషన్స్ వంటి వార్తలు వచ్చాయి. మొదట శ్రీశాంత్ ఆ తర్వాత యువరాజ్ తో ఆమె ప్రేమాయణాన్ని కొనసాగించిదని టాక్. అంతే కాకుండా 2005లో అప్పటి తన బాయ్ ఫ్రెండ్ అయిన అస్మిత్ పటేల్ తో లిప్ లాక్ ఎమ్మెమ్మెస్ సంచలనాన్ని సృష్టించింది. హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న కొద్దీ ఆమెను వివాదాలు కూడా బాగా చుట్టుముట్టాయి. అదే విధంగా 2010 లో ఓ సినీ నటుడు కుమారుడిని నైట్ పార్టీలో అందరు చూస్తుండగానే లిప్ లాక్ చేసి అందరికి దిమ్మ తిరిగేలా చేసింది.

ఇక 2011 లో ఉపేన్ పటేల్ అనే మోడల్ తో నైట్ క్లబ్ లో చిందులు వేస్తూ అడ్డంగా మీడియా కంట పడిపోయింది. గత ఏడాది కూడా బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్య తో ఓ హోటల్ కి వెళ్లిన ఫోటోలు బయటపడటంతో అవి సోషల్ మీడియాలో డేటింగ్ చేస్తున్నట్లు వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత ఆ సింగర్ జస్ట్ డిన్నర్ అని క్లారిటీ ఇచ్చినా లాభం లేకపోయింది. రియా సేన్ కెరీర్ లో ఇలా ఎక్కడ ఎవరిని మీట్ అయినా ఆమె డేటింగ్ చేస్తున్నట్లుగానే వార్తలు వచ్చేవి. ఆఖరికి ఓ రచయితతో కూడా రిలేషన్ ని మెయింటేన్ చేస్తోందని వార్తలొచ్చాయి. ఇక ఈ అమ్మడికి కొన్ని ప్రపోసల్స్ కూడా బాగానే వచ్చాయి. అప్పట్లో జాన్ అబ్రహం -బిపాసా బసుతో రిలేషన్ లో లేనప్పుడు రియాని ప్రపోస్ చేయడంతో ఆమె సినిమా కెరీర్ దృష్టిలో ఉంచుకొని ఒప్పుకోలేకపోయిందట. అలాగే కొన్ని కాంట్రవర్సీ ఫొటోలు మరియు డ్రగ్స్ అలవాట్లు ఉన్న వారితో కూడా రియా ఫ్రెండ్షిప్ చేసిందని కూడా కామెంట్స్ వినబడ్డాయి.

రీసెంట్ గా రియా.. ఏక్తా కపూర్ - రాగిని ఎమ్మెమ్మెస్ -2 వెబ్ సిరీస్ షూటింగ్ లో తన కో స్టార్ నిశాంత్ అండర్ వేర్ ని కొంచెం లాగి..ఫొటోకు పోజ్ ఇచ్చింది..అంతే కాకుండా అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఎక్స్ పోజ్ చెయ్యగలరు అని ఓ కామెంట్ పెట్టి సోషల్ మీడియాలో ఆ ఫొటోను పోస్ట్ చేసింది. ఇక ఓ రియాల్టీ షోలో ఆమె చేసిన వీరంగం కూడా మీడియాలో హల్ చల్ చేసింది. ఇలా తన కెరీర్ లో రియా ప్రతి ఏడాది ఎదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకొని చివరికి పెళ్లిని కూడా కాంట్రవర్సీ గా చేసుకుంది. అది సంగతి.