Begin typing your search above and press return to search.

రీతు వర్మ.. ఆ విషయంలో బాగా స్లో

By:  Tupaki Desk   |   4 Sep 2017 4:26 AM GMT
రీతు వర్మ.. ఆ విషయంలో బాగా స్లో
X
పెళ్లి చూపులు మూవీ చాలామంది కెరీర్స్ ను మార్చేసింది. హీరో విజయ్ దేవరకొండకు ఎంతటి క్రేజ్ ఏర్పడిందో.. రీసెంట్ మూవీ అర్జున్ రెడ్డి ప్రూవ్ చేసింది. మరోవైపు కమెడియన్ ప్రియదర్శి కూడా అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. హీరోయిన్ రీతు వర్మకు కూడా డిమాండ్ పీక్ స్టేజ్ కి చేరిపోయింది.

ఓ దశలో అయితే.. భారీ రెమ్యూనరేషన్ తో ఆఫర్స్ అందుకోవడమే కాదు.. ఫలానా హీరోతో అయితేనే నటిస్తా అంటూ.. మేకర్స్ కి కండిషన్స్ పెట్టే రేంజ్ కు వెళ్లిందని.. దానికి కూడా పలువురు సై అన్నారనే టాక్ వినిపించింది. కానీ వాస్తవంగా చూస్తే మాత్రం పరిస్థితి అంత పాజిటివ్ గా ఉన్నట్లుగా అనిపించదు. పెళ్ళిచూపులు తరువాత ఈమె చాలానే చెప్పింది.. తమిళంలో విక్రమ్ తో ఓ సినిమా చేస్తోంది కానీ.. తెలుగులో ఇంతవరకు చేతిలో పెద్ద సినిమా లేదు. సంవత్సరం దాటినా తెలుగులో మళ్లీ హిట్టు కొట్టలేదు. ఈ ఏడాది సమ్మర్ లో వచ్చిన నిఖిల్ మూవీ కేశవలో మాత్రమే కనిపించింది ఈ పెళ్లి చూపులు భామ. కానీ ఆ మూవీలో ఏ మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయిన కేరక్టర్లలో ఈమె రోల్ కూడా ఒకటి.

గతంలో సమంతకు ఇలాగే ఫస్ట్ మూవీలో సక్సెస్ వస్తే.. దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ.. వరుస సినిమాలు చేస్తూ అంతకంతకూ క్రేజ్ పెంచుకుంది. రీసెంట్ గా కీర్తి సురేష్ కూడా ఇదే బాట పట్టిందనే సంగతి అర్ధం అవుతోంది. కానీ రీతువర్మ మాత్రం సరైన ఆఫర్స్ కోసం ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితిలోనే ఉండడం ఆశ్చర్యకరమైన విషయమే.