పెళ్లి చూపులు పిల్ల అక్కడ బానే చేస్తోంది

Wed Feb 14 2018 23:00:01 GMT+0530 (IST)

బాద్షా సినిమాతో వెండితెరకు పరిచయమైన హైదరాబాద్ గర్ల్ రీతు వర్మ. ఈ బ్యూటీ మొదట్లో సహ నటిగా కొన్ని సినిమాల్లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక పెళ్లి చూపులు సినిమాతో డైరెక్ట్ హీరోయిన్ గా మారి ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ హిట్ ను అందుకుంది. అయితే ఆమె అదృష్టం ఏమిటో గాని అందరి తెలుగమ్మాయిల్లానే పరభాష సినిమాల్లోనే అవకాశాలను ఎక్కువగా అందుకుంటోంది.ఆ మధ్యలో కేశవ సినిమాలో కనిపించినప్పటికీ పెద్దగా క్రేజ్ రాలేదు. ఇక తమిళ్ లో వరుసగా ఆఫర్లు వస్తుండడంతో ఏ మాత్రం నో చెప్పకుండా చాలా స్పీడ్ గా సినిమాలను చేస్తోంది. స్టార్ హీరోల రేంజ్ సినిమాలు కాకపోయినప్పటికీ మినిమమ్ రేంజ్ ఉన్న కథానాయకులతో నటిస్తోంది. తెలుగులో ఈ మధ్య రెండు ఆఫర్స్ వస్తే కథలో తన పాత్రకు ప్రాధాన్యం లేదని అమ్మడు నో చెప్పిందని టాక్. ఇక ప్రస్తుతం తమిళ్ లో దుల్కర్ సల్మాన్ తో ఒక సినిమా చేస్తోంది.

కణ్ణుమ్ కణ్ణుమ్ కొళ్ళైయాడైత్తాల్ అనే ఆ సినిమా ప్రమోషన్స్ ని రీసెంట్ గా చిత్ర యూనిట్ స్టార్ చేసింది. ఆ సినిమాతో పాటు మరో రెండు తమిళ్ సినిమాలు కూడా రీతూ చేతిలో ఉన్నాయి. ఇంకా మలయాళం లో ఎంట్రీ ఇవ్వలేదు కానీ మంచి కథలు వస్తే అక్కడ కూడా ఎంట్రీ ఇస్తుందట ఈ పెళ్లి చూపులు పిల్ల.