Begin typing your search above and press return to search.

తెలుగ‌మ్మాయ్ త‌మిళ్‌ లో దూసుకెళ్తోంది

By:  Tupaki Desk   |   5 Oct 2015 1:30 PM GMT
తెలుగ‌మ్మాయ్ త‌మిళ్‌ లో దూసుకెళ్తోంది
X
బాద్‌ షా చిత్రంలో క్యారెక్ట‌ర్ రోల్ ప్లే చేసింది రితూ వ‌ర్మ‌. ప్రేమ ఇష్క్ కాద‌ల్ చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. ఆ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటోంది. ఇటీవ‌లే నాని న‌టించిన ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం చిత్రంలో నానికి ఫియాన్సీగా న‌టించి మెప్పించింది. ఆ త‌ర్వాత తెలుగులో త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అనుకోకుండా అనే చిత్రంలో న‌టిస్తోంది. అది త‌ప్ప వేరే ఏ సినిమాకి క‌మిట‌వ్వ‌లేదు.

అయితే ఇంత‌లోనే త‌మిళ్‌లో ఈ భామ కెరీర్ జెట్ స్పీడ్ అందుకుంది. ఇప్ప‌టికిప్పుడు ఓ రెండు ప్రాజెక్టుల‌కు సంత‌కాలు చేసింది. యంగ్ హీరో చిన్న‌స‌ర‌స‌న క‌ళై యార‌సాన్ అనే చిత్రంలోనూ ఆడిపాడుతోంది. దాంతో పాటు ప్ర‌తిష్ఠాత్మ‌క కార్పొరెట్ దిగ్గ‌జం ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ నిర్మిస్తున్న తాజా చిత్రానికి సంత‌కం చేసింది. అబ్ర‌హాం ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ నిర్మించే సినిమాలో న‌టిస్తోంది. పిరాయ్ త‌డాయా నాట్క‌ల్ అనేది టైటిల్‌. అశోక్ సెల్వ‌న్ క‌థానాయ‌కుడు. తెలుగ‌మ్మాయ్ స్పీడ్ చూస్తుంటే ఎక్క‌డికో వెళ్లేట్టే క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే బింధుమాధ‌వి - స్వాతి - శ్రీ‌దివ్య‌ - ఆనందిని (ర‌క్షిత‌) లాంటి నాయిక‌లు త‌మిళంలో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుని వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. ఇప్ప‌డు వీళ్ల బ్యాచ్‌ కి రీతూ వ‌ర్మ కూడా యాడైంది. న‌ట‌న‌లో మ‌రింత‌గా మెరుగులు దిద్దుకుంటూ ఇరుగు పొరుగున రీతూ రాణించాల‌ని ఆకాంక్షిద్దాం.