Begin typing your search above and press return to search.

ఒక్క హిట్టుకే మార్చేశావా రీతూ!!

By:  Tupaki Desk   |   28 Aug 2016 9:30 AM GMT
ఒక్క హిట్టుకే మార్చేశావా రీతూ!!
X
హైద్రాబాదీ భామ రీతు వర్మ మూడేళ్లుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ట్రై చేస్తోంది. ప్రేమ ఇష్క్ కాదల్.. నా రాకుమారుడు వంటి చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించడంతో పాటు.. ఎవడే సుబ్రమణ్యం లాంటి చిత్రాలో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది. అయితే.. పెళ్లి చూపులు తర్వాత ఈమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

ఇప్పుడీ హీరోయిన్ కు క్రేజ్ ఏర్పడిన సంగతి ఒప్పుకోవాల్సిందే. అందుకే దాన్ని కరెక్ట్ గా క్యాష్ చేసుకునేలా స్టెప్స్ వేస్తోందట. పెళ్లి చూపులు రిలీజ్ కి ముందే వేరే సినిమాలు చేసేందుకు ఒప్పుకున్న రీతువర్మ.. ఇప్పుడా సినిమాల నిర్మాతలకు చుక్కలు చూపించేస్తోందట. ఒకవైపు రెమ్యూనరేషన్ పెంచడంతో.. అబ్జెక్షన్స్ కూడా పెట్టేస్తోందని తెలుస్తోంది. పెళ్లి చూపులు రిలీజ్ కాకముందు.. అడివి శేష్ హీరోగా రూపొందే సినిమాకి రీతు సైన్ చేసింది. ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం.. అడివి శేష్ సినిమాకి ఈమె నో చెప్పేస్తోందనే టాక్ వినిపిస్తోంది.

అడివి శేష్ పెద్ద హీరో కాకపోవడంతోనే ఈ అభ్యంతరం అన్నది టాక్. అయితే.. ఆ నిర్మాతలు మాత్రం దీన్ని పెద్దది చేయకుండా.. రీతు వర్మ డేట్స్ ని నిఖిల్ తో చేసే సినినమాకి ఉపయోగించాలని డిసైడ్ అయ్యారట. మొత్తానికి తన క్రేజ్ ని బాగానే క్యాష్ చేసేసుకుంటోంది రీతు వర్మ.