Begin typing your search above and press return to search.

మెగా హీరోకి జోడీగా గురు భామ

By:  Tupaki Desk   |   12 Jun 2018 3:08 PM GMT
మెగా హీరోకి జోడీగా గురు భామ
X
స్పోర్ట్స్ పర్సనాలిటీలుగా వెలిగిపోయేవారికి సినిమాల్లో సత్తా చాటడం చిన్న విషయమేమీ కాదు. ఫిట్నెస్ బాగున్నా పర్సనాలిటీ మెయింటెనెన్స్ విషయంలో గ్లామర్ వరల్డ్ కి.. ఆటల ప్రపంచానికి చాలానే అంతరం ఉంటుంది. అందుకే కొందరు భామలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ బాక్సింగ్ భామ రితికా సింగ్ మాత్రం ఇది కూడా సాధ్యమే అని నిరూపించింది.

ప్రొఫెషనల్ కిక్ బాక్సర్ అయిన రితికా సింగ్.. తమిళ మూవీ ఇరుదు సూత్రు చిత్రంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇదే సినిమా తెలుగులో గురు అంటూ రీమేక్ అయింది కూడా. ఆ మూవీలో రితిక యాక్టింగ్ కు విపరీతమైన గుర్తింపు వచ్చింది. సినిమా కూడా సక్సెస్ అయింది. కానీ ఈమెకు కెరీర్ పరంగా మాత్రం ప్రయోజనం మాత్రం కలుగలేదు. ఆ సినిమా వచ్చి ఏడాది గడిచిపోయినా.. తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. తమిళ్ లో చేసిన శివలింగ.. అండావన్ కట్టాలై చిత్రాలు ఫెయిల్యూర్ అయ్యాయి. ఇప్పుడు రితికా సింగ్ తన గ్లామర్ విషయంలో బాగా దృష్టి పెట్టి.. వర్క్ అవుట్స్ చేసి ఈ మధ్య స్లిమ్ గా మారిపోయింది.

ఎంతో ట్యాలెంట్ ఉన్న రితికా సింగ్ ఇప్పుడు గ్లామర్ గా కూడా మారిపోవడంతో.. ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు టాలీవుడ్ మేకర్స్ ముందుకొస్తున్నారు. అప్పుడే ఈమెకు ఓ క్రేజీ ఆఫర్ చేతికి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అది కూడా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ చేస్తున్న చిత్రలహరిలో లీడ్ రోల్ దక్కించుకుందట. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రూపొందే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.