Begin typing your search above and press return to search.

కోచ్ వెంకీకి స్టూడెంట్ దొరికిందోచ్

By:  Tupaki Desk   |   29 July 2016 6:09 AM GMT
కోచ్ వెంకీకి స్టూడెంట్ దొరికిందోచ్
X
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం బాబు బంగారం మూవీని రిలీజ్ కి రెడీ చేసేశాడు. ఇది రిలీజ్ అయిన వెంటనే కొత్త సినిమా స్టార్ట్ చేసేయనున్నాడు. అదే.. బాలీవుడ్ మూవీ సాలా ఖదూస్. ఒరిజినల్ లో మాధవన్ నటించిన బాక్సింగ్ కోచ్ పాత్రలో వెంకీ నటించనున్నాడు.

ఇప్పుడీ మూవీలో స్టూడెంట్ పాత్రను ఫైనల్ చేశారు. తమిళ మాతృక ఇరుదు సూత్రు(హిందీలో సాలా ఖదూస్)లో నటించిన రితికా సింగ్ నే తెలుగులో కూడా తీసుకున్నారు. బాక్సింగ్ కోచ్ గా మాధవన్ కి ఎన్ని మార్కులు పడ్డాయో.. స్టూడెంట్ గా రితికా సింగ్ కు కూడా అన్నే ప్రశంసలు దక్కాయి. అలా ఈ భామ టాలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది. అయితే.. తెలుగులో ఈ పాత్ర చేయడంతో రితిక ఓ రికార్డ్ సృష్టించబోతోంది. సాలాఖడూస్ తో హిందీలోను.. ఇరుదుసూత్రుతో తమిళంలోను ప్రవేశించిన రితికా సింగ్.. మూడో భాషలో కూడా అదే మూవీతో అరంగేట్రం చేస్తోంది.

టాలీవుడ్ కి అనుగుణంగా కథలో పలు మార్పులు చేర్పులు చేసినట్లు డైరెక్టర్ సుధ కొంగర ప్రసాద్ చెబుతున్నారు. ఈ మూవీ చేయడం ద్వారా రీమేక్ లపై తనకు ఎంత గురో వెంకటేష్ మరోసారి చెబుతున్నట్లయింది.