హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కు సీక్రెట్ ఇదేనట!

Mon Jun 24 2019 18:22:48 GMT+0530 (IST)

హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కు సీక్రెట్ ఏంటని ఒక మందుబాబు ఇంకో సీనియర్ లిక్కర్ తత్వవేత్తని అడిగితే 'అన్నీ మూసుక్కూచోవడం ఒక్కటే దారి' అని ఘాటుగా శెలవిచ్చాడట.  ఇంకోటేదైనా చెప్పండి బాబ్బాబు అని బ్రతిమాలితే 'మొదటి రూల్ ను స్ట్రిక్ట్ గా ఫాలో కావడమే' అంటూ ఒక గుక్క బిగించాడట.   నిజమే.. హ్యాపీ మారీడ్ లైఫ్ కు సీక్రెట్ లు ఏముంటాయి? సర్దుకోవడం.. సర్దుకోవడం.. సర్దుకోవడం.. ఒక్కటే దారి.. లేకపోతే తప్పదు ఆ దాంపత్యానికి ఘోరీ!అయితే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ రీసెంట్ గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కు ఒక సీక్రెట్ చెప్పాడు. ఆయన ఎవరని అడక్కండి. మాజీ టాలీవుడ్ హీరోయిన్ జెనిలియా డిసౌజా భర్తగారే ఈ రితీష్ దేశ్ ముఖ్.  2012 లో ఇద్దరి వివాహం అయింది. ఈ జంటకు ఇద్దరు అబ్బాయిలు. బాలీవుడ్ లో ఉన్న స్వీట్.. క్యూట్ కపుల్స్ లో రితేష్ - జెనీలియా జంట ఒకటి.  అందుకే రీసెంట్ గా రితేష్ తన సీక్రెట్ ను ఒక వీడియో ద్వారా వెల్లడించాడు.

ఈ వీడియో లో మొదట రితేష్ మాత్రమే కనిపిస్తాడు. సంతోషకరమైన వివాహ జీవితానికి కిటుకు ఇదే.. అంటూ మొదలు పెడతాడు. అప్పుడు కెమెరాను జూమ్ అవుట్ చేసి చూపిస్తే.. ఆయన సతీమణి జెనీలియా కాళ్ళను మహా ప్రేమగా ఒత్తుతూ తన్మయత్వంతో కూడిన సంతోషం అనుభవిస్తూ ఉంటాడు.  జెనీలియా సోఫాలో అడ్డంగా పడుకొని పకపకా నవ్వుతూ 'తాన నానా నానా.. కుచ్  కుచ్ హోతా హై" అంటూ హమ్ చేస్తూ ఉంటుంది.  అర్థం అయిందిగా బాలీవుడ్ జంట విజయవంతమైన వివాహ రహస్యం. ఈ కాలం ఆడియన్స్ కాబట్టి షార్ట్ వీడియోలోక్రిస్ప్ గా రెండు ముక్కల్లో  చెప్పారు. గ్రామర్ తప్పులుంటే మన్నించండి.. అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించండి.