Begin typing your search above and press return to search.

ఆస్కార్ 2019 బరిలో విలేజ్ రాక్‌ స్టార్స్‌

By:  Tupaki Desk   |   22 Sep 2018 11:45 AM GMT
ఆస్కార్ 2019 బరిలో విలేజ్ రాక్‌ స్టార్స్‌
X
ఆస్కార్ 2019 ఇండియాకి ప్రాతినిధ్యం వ‌హించే సినిమా ఏది? ఎప్ప‌టిలానే హిందీ - మ‌రాఠీ - త‌మిళం - గుజ‌రాతీ, అస్సామీ అంటూ అన్ని భాష‌ల నుంచి సినిమాల పేర్లు వినిపించాయి. కానీ ఈసారి ఊహించ‌ని షాక్‌. దాదాపు 29 సినిమాలు జాబితాలో చేరితే ఈసారి ఆ అనూహ్యంగా ఓ అస్సామీ సినిమా ఎగ‌రేసుకుపోవ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. ప‌ద్మావ‌త్ 3డి - రాజీ వంటి సంచ‌ల‌న చిత్రాల‌తో పోటీప‌డుతూ `విలేజ్ రాక్‌ స్టార్స్` అనే అస్సామీ చిత్రం ఈ సారి భార‌త‌దేశం త‌ర‌పున ప్రాంతీయ కేట‌గిరీలో ప్రాతినినిధ్యం వ‌హిస్తోంది.

ఆస్కార్ చిత్రాల ప‌రిశీల‌న‌లో ఇది ఊహించ‌ని ప‌రిణామం. ఎప్ప‌టిలానే బాలీవుడ్ నుంచి అర‌డ‌జ‌నుపైగానే చిత్రాలు ఆస్కార్ బ‌రి నామినేష‌న్ల బ‌రిలో నిలవ‌గా వేటికీ ఆ ఛాన్స్ ద‌క్క‌లేదు. ఆ క్ర‌మంలోనే ఊహించ‌ని రీతిలో ఆస్కార్ బ‌రిలో నిలిచే సినిమా విలేజ్ రాక్‌ స్టార్స్ ని ఫైన‌ల్ చేశామంటూ క‌మిటీ ప్ర‌క‌టించి పెద్ద షాకిచ్చింది. ఇన్నేళ్ల‌లో ఒక అస్సామీ సినిమాకి ఈ స్థాయి గుర్తింపు అన్న‌దే లేదు. బాలీవుడ్ - కోలీవుడ్ - టాలీవుడ్ లాంటి ప‌రిశ్ర‌మ‌ల‌తో పోలిస్తే అస‌లు అస్సామీ ప‌రిశ్ర‌మ అన్న‌ది ఉంది అన్న మాట కూడా వినిపించ‌దు.

అలాంటి చిన్న ప‌రిశ్ర‌మ నుంచి విలేజ్ రాక్‌ స్టార్స్ ఈసారి ఆస్కార్స్ 2019 బ‌రిలో నిలిచింద‌న్న మాట దిగ్ధ‌ర్శ‌కులే డైజెస్ట్ కానిది. అయితే అంత‌గా ఈ సినిమాలో ఏం ఉంది? అంటే .. ఆ క‌థ‌లో ఆత్మ ఉంది. ఒక నిరుపేద కుటుంబంలో జ‌న్మించిన చిన్నారి దును - క‌నీసం సొంతంగా ఒక గిటార్ అయినా కొనుక్కోలేని చిన్నారి రాక్‌స్టార్‌గా మారాల‌న్న లక్ష్యం తో ఏం చేసింది? అన్న‌దే ఈ సినిమా క‌థాంశం. రీమా దాస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ ం వ‌హించారు. స‌హ‌జ‌సిద్ధ‌త‌, అత్యుత్త‌మ‌మైన ఎమోష‌న్‌ - వాస్త‌విక‌త ఉన్న చిత్ర‌మిది. అందుకే ఇప్ప‌టికే 65వ జాతీయ అవార్డుల వేడుక‌లో ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఎన్నో అవార్డుల పండుగ‌లో మెరిసిన చిత్ర‌మిది. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ నుంచి ఉత్త‌మ ప్రాంతీయ చిత్రం కేట‌గిరీలో ఇండియా త‌ర‌పు నుంచి నామినేట్ అయ్యి సంచ‌ల‌నం సృష్టించింది. దిగ్గ‌జాలు సంజ‌య్ లీలా భ‌న్సాలీ, మేఘ‌నా గుల్జార్ వంటి టాప్ ద‌ర్శ‌కుల సినిమాల్ని కాద‌ని అంత చిన్న సినిమాకి ఈ గుర్తింపును క‌ట్ట‌బెట్ట‌డంపై క‌మిటీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఇక ఇంత చిన్న సినిమాని ఆస్కార్ స్థాయిలో ప్ర‌మోట్ చేసుకోవాలంటే ఆర్థిక‌ప‌ర‌మైన అండా దండా అవ‌స‌రం. అందుకే అస్సామీ ప్ర‌భుత్వం కోటి రూపాయ‌లు చిత్ర నిర్మాత‌ల‌కు సాయంగా అందించాల‌ని కేంద్రం కోర‌నుంది.