Begin typing your search above and press return to search.

బెల్లంకొండది తప్పా? అభిషేక్ ది తప్పా?

By:  Tupaki Desk   |   25 Oct 2016 11:30 AM GMT
బెల్లంకొండది తప్పా? అభిషేక్ ది తప్పా?
X
ఇప్పుడు టాలీవుడ్ అంతటా మరో సంచలన నిర్మాణ సంస్థ గురించే చెప్పుకుంటున్నారు. చాలామంది నిర్మాతలు ఎన్నో ఏళ్ళు వ్యయప్రయాసలతో ఒక సంస్థను నెలకొల్పి.. దాని ప్రయాణం చాలా జాగ్రత్తగా కొనసాగిస్తుంటారు. గీతా ఆర్ట్స్ అండ్ దిల్ రాజు.. అందుకు పెద్ద ఉదాహరణలు. కాని ఒక్కసారిగా కొన్ని కొన్ని సంస్థలు టక్కున లైమ్ లైటులోకి వస్తుంటాయి. అలాగే తోక చుక్కల్లా అంతే స్పీడుగా రాలిపోతుంటాయి కూడా. గతంలో ఆర్.ఆర్.మేకర్స్ వంటి సంస్థలు అలాగే బోర్డులు తిప్పేశాయి.

ఆ మధ్యన శ్రీమంతుడు సినిమాను భారీ రేట్లకు కొనడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది నైజాం కు చెందిన అభిషేక్ పిక్చర్స్. ఇక వరుసపెట్టి పెద్ద సినిమాలను భారీ రేట్లకు కొనేసింది. అసలు దిల్ రాజు వంటి దిగ్గజాలు కూడా ఆఫర్ చేయని రేట్లకు వీరు సినిమాలను కొంటుంటే.. లాస్ ఫార్మాట్లో వీరు బిజినెస్ ఎలా నడిపిస్తారు అంటూ అందరూ షాకైపోయారు. అయితే ఈ సంస్థలో తొలుత నుండి కొందరు తెలంగాణకు చెందిన పొలిటికల్ లీడర్లు ఇన్వెస్ట్ చేశారనే టాక్ ఉంది. ఇకపోతే మనోళ్ళు ఏకంగా ఒక ఐదు సినిమాలను ప్రొడ్యూస్ చేయనున్నట్లు కూడా తెలిపారు. అందులో నిఖిల్ అండ్ సుధీర్ వర్మ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా పట్టాలెక్కగా.. వీరు ఎక్కుపెట్టిన బోయపాటి శ్రీను.. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాను మాత్రం ఆపేశారు. ఎందుకంటారు? అని అడిగితే.. ప్రతీ విషయంలో బెల్లంకొండ సురేష్‌ (హీరో శ్రీనివాస్ తండ్రి) ఇన్వాల్వ్ అయిపోతున్నారని అంటున్నారు. కాని ఇక్కడ ఇండస్ర్టీ టాక్ మాత్రం వేరేగా ఉంది.

మొన్నటివరకు ఇన్వెస్టర్లు అందరూ అభిషేక్ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసినప్పటికీ.. కబాలి తరువాత వచ్చిన లాసుతో వారందరూ చేతులు ఎత్తేశారట. అందుకే కంపెనీలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ రావడం వలనే బోయపాటి సినిమాను ఆపేశారని బెల్లంకొండ సురేష్‌ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వీరు చెప్పిందా వారు చెప్పిందా నిజమా అనేది ఒక విషయం అయితే.. ఒకప్పుడు బెల్లంకొండ సురేష్‌ కూడా భారీ రేట్లకు రీమేక్ హక్కులను కొని.. మార్కెట్ లేని హీరోయిన్లకు భారీగా పేమెంట్లు ఇచ్చేసి.. భారీ భారీగా సినిమాలు తీశాడు. సినిమాలే కాదు.. ఆయన కూడా ఫ్లాపయ్యాడు. ఇప్పుడు చూస్తుంటే అభిషేక్ వారు కూడా అదే రూట్లో వెళ్తున్నట్లు లేదూ? జాగ్రత్త గురూ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/