Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ హీరోయిన్‌ కి పెళ్లి ఫిక్స్

By:  Tupaki Desk   |   16 Jan 2019 5:18 AM GMT
ప్ర‌భాస్ హీరోయిన్‌ కి పెళ్లి ఫిక్స్
X
ప్ర‌భాస్ స‌ర‌స‌న మిర్చి సినిమాలో క‌థానాయిక‌గా న‌టించింది రిచా గంగోపాథ్యాయ్. అంత‌కుముందు మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న `మిర‌ప‌కాయ్` లోనూ క‌థానాయిక‌గా ఆడిపాడింది. గోపిచంద్ `వాంటెడ్`లోనూ రిచా నాయిక‌. లీడ‌ర్ తో మొద‌లైన ఈ అమ్మ‌డి కెరీర్ `భాయ్` సినిమాతో ముగిసింది. ఆ త‌ర్వాత ఆశించిన స్థాయిలో వెల‌గ‌లేద‌న్న సంగ‌తి తెలిసిందే.

అప్ప‌ట్లో రిచా అమెరికాలో స్ట‌డీ కొన‌సాగించేందుకు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డే త‌న క్లాస్ మేట్ జోను రిచా పెళ్లాడ‌బోతోందిట‌. తాజాగా హ‌బ్బీ జోతో క‌లిసి ఉన్న‌ప్ప‌టి పోటోని రిచా త‌న సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసింది. పెళ్లి క‌బురును అధికారికంగా చెప్పేసింది.``నా అభిమానుల‌కు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు జోతో నిశ్చితార్థం పూర్తయింది. నేను- జో బిజినెస్ స్కూల్ లో కలిశాం. రెండేళ్లు అద్భుతంగా గడిచిపోయాయి. నా జీవితంలో ఓ కొత్త దశలోకి అడుగుపెడుతున్నాను. పెళ్లి తేదీ ఇంకా ఖ‌రార‌వ్వ‌లేదు`` అని రిచా తెలిపింది.

మొత్తానికి రిచా సినిమాల‌కు స్వ‌స్థి చెప్పి పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్ట‌బోతోంది. ఇక‌పై సినిమాల్లో న‌టించే ఆస‌క్తి లేద‌ని చెప్పేసింది. అయితే చాలా మంది క‌థానాయిక‌లు పెళ్లి త‌ర్వాత సెకండ్ ఇన్సింగ్స్ కొన‌సాగించిన సంగ‌తి తెలిసిందే. కొంత గ్యాప్ త‌ర్వాత సంసార స‌రిగ‌మ‌ల్ని ఆస్వాధించిన అనంత‌రం రిచా మైండ్ సెట్ మారే ఛాన్సు ఉంటుందేమో!