రిచా కౌంటర్ కరెక్టేనా?

Sun Jan 14 2018 11:16:20 GMT+0530 (IST)

ఈ మధ్య అవకాశాలు తగ్గి కనిపించడం లేదు కాని ప్రభాస్ రవితేజ రానా లాంటి హీరోలతో సూపర్ హిట్ మూవీస్ చేసిన ఎన్ఆర్ఐ హీరొయిన్ రిచా గంగోపాధ్యాయ్ గుర్తుందిగా తాజాగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ తో వార్తల్లోకి వచ్చే ప్రయత్నం చేసింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్  దాకా ఈ మధ్య కనిపిస్తున్న ట్రెండ్ ఏంటంటే గతంలో విడుదలైన సినిమాలకు యానివర్సరి పేరుతో సంబరాలు చేసుకోవడం. అది హిట్ మూవీ అయినా ప్రశంశలు పొందిన ఫ్లాప్ సినిమా అయినా ఆయా అభిమానులకు ఇలా చేసుకోవడం ఒక అలవాటుగా మారింది. ఆ మధ్య షారుఖ్ ఖాన్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సిల్వర్ జుబ్లీ ఇయర్స్ పేరుతో భారీ వేడుకను చేసారు. గబ్బర్ సింగ్ 1 నేనొక్కడినే యమదొంగ వర్షం లాంటి వాటికి స్పెషల్ గా పోస్టర్స్ డిజైన్ చేసి మరీ ఆన్ లైన్ లో హల్చల్ చేసారు.దీని మీద రిచా ఇప్పుడు పంచులు వేసింది. ఇలా చేసుకోవడంలో ఉద్దేశం తెలియడం లేదని హాలీవుడ్ లో ఇలాంటి ట్రెండ్ ఎప్పుడు చూడలేదని ఒకవేళ అలా చేయాల్సి వస్తే టైటానిక్ 20 ఇయర్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేయాల్సి ఉంటుందని చెప్పింది. తెలుగు/తమిళ సినిమా పరిశ్రమల్లో ఇలా యానివర్సరీ పేరుతో హంగామా చేయడం ఏంటో తనకు అర్థం కావడం లేదని చెప్పింది.

కాని ఇక్కడ రిచా మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. భారతీయ సినిమాలో అతి కీలకంగా భావించే తెలుగు తమిళ్ లో సినిమాను ఇంతగా ప్రేమించే అభిమానం ఇంకెక్కడా కనిపించదు. అందుకే ఎంత భారీ బడ్జెట్ అయినా లెక్క చేయకుండా సినిమాలు తీస్తున్నారు కాబట్టే ఈ రోజు హాలీవుడ్ సినిమాలకు దీటుగా ఓపెనింగ్స్ తెచ్చుకునే స్థాయికి తెలుగు సినిమా చేరుకుంది. అయినా ఎవరి ఆనందం వాళ్ళది  చేసుకొనీ అని వదిలేయకుండా ఈ కామెంట్స్ ఏంటో రిచాకే తెలియాలి.