Begin typing your search above and press return to search.

'షకీలా' మూవీ కోసం బెల్లీ డాన్స్‌ ఎంటో..?

By:  Tupaki Desk   |   22 Oct 2018 6:17 AM GMT
షకీలా మూవీ కోసం బెల్లీ డాన్స్‌ ఎంటో..?
X
సౌత్‌ ఇండియన్‌ యూత్‌ ప్రేక్షకులను ఒకప్పుడు ఉర్రూతలూగించిన శృంగార తార షకీలా జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. స్వయంగా ఈ చిత్రం కోసం షకీలా తన జీవితంలోని పలు విషయాలను - చీకటి కోణాలను దర్శకుడు ఇంద్రజిత్‌ లోకేష్‌ కు తెలియజేయడం జరిగింది. షకీలా గురించి ఎన్నో తెలియని విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ రిచా చద్దా ఈ చిత్రంలో షకీలా పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే.

ప్రస్తుతం ఈ చిత్రం కోసం రిచా చద్దా బెల్లీ డాన్స్‌ ట్రైనింగ్‌ తీసుకుంటుందట. ముంబయికి చెందిన ప్రముఖ బెల్లి డాన్స్‌ ట్రైనర్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. కొత్త డాన్స్‌ ను నేర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని - షకీలా మూవీకి తాను చేయబోతున్న బెల్లీ డాన్స్‌ చాలా ఉపయోగపడుతుందనే నమ్మకం తనకు ఉందని సోషల్‌ మీడియాలో రిచా చద్దా పేర్కొంది. షకీలా మూవీలో బెల్లీ డాన్స్‌ ఏంటా అంటూ అంతా షాక్‌ అవుతున్నారు.

కథానుసారంగా ఈ చిత్రంలో డ్యూయెట్స్‌ - కమర్షియల్‌ సాంగ్స్‌ ఉండబోవడం లేదట. అందుకే సినిమ ప్రమోషన్‌ కోసం ఒక సాంగ్‌ ను ప్లాన్‌ చేశారు. ఆ ప్రమోషనల్‌ సాంగ్‌ లో రిచా చద్దా బెల్లీ డాన్స్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బెల్లీడాన్స్‌ చేయడం తనకు ఎంతో ఇష్టం అని - ఈ చిత్రం కోసం డాన్స్‌ చేయడం సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. షకీల బయోపిక్‌ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సిల్క్‌ స్మిత డర్టీ పిక్చర్‌ కంటే ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.