Begin typing your search above and press return to search.

సరోజ్ కు హీరోయిన్ సపోర్ట్!!

By:  Tupaki Desk   |   25 April 2018 11:00 AM GMT
సరోజ్ కు హీరోయిన్ సపోర్ట్!!
X
చిన్నపాటి క్యారెక్టర్లు.. ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ నుంచి ఇప్పుడు లీడ్ రోల్స్ వరకూ తన కెరీర్ ను డెవలప్ చేసుకున్న బ్యూటీ రిచా ఛడ్డా. ఒకేసారి హీరోయిన్ గా కాకుండా.. కొన్నేళ్ల పాటు కష్టపడి మరీ హీరోయిన్ రేంజ్ ను అందుకుందంటే.. ఇండస్ట్రీలో ఈమె ఎంతగా కష్టపడిందో అర్ధం అవుతుంది.

ఇప్పుడీ భామ క్యాస్టింగ్ కౌచ్ అంశంపై రియాక్ట్ అయింది. అలా చెప్పే కంటే.. కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న వారి పట్ల రియాక్ట్ అయింది అని చెప్పడం సబబుగా ఉంటుంది. ప్రతీ రంగంలోను ఈ క్యాస్టింగ్ కౌచ్ విధానం ఉందని.. సినిమా ఇండస్ట్రీలో కనీసం అవకాశాలు అయినా ఇస్తున్నారని సరోజ్ ఖాన్ వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది. ఆమె క్యాస్టింగ్ కౌచ్ ను సమర్ధిస్తోందంటూ పలువురు.. సరోజ్ ఖాన్ ను టార్గెట్ చేస్తున్నారు. అయితే.. రిచా ఛడ్డా మాత్రం సరోజ్ ఖాన్ ను డైరెక్టుగా సపోర్ట్ పలికింది.

తాను సరోజ్ ఖాన్ ఇంటర్వ్యూ మొత్తం చూశానంటున్న రిచా.. ఆమె వ్యాఖ్యలలో తప్పేమీ కనిపించడం లేదని అభిప్రాయపడింది. క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం కచ్చితంగా వ్యతిరేకించాల్సిన వ్యవహారమే అయినా.. బాలీవుడ్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం కరెక్ట్ కాదన్నది ఆమె వాదన. దీని నివారణకు చర్యలు చేపట్టడం మానేసి.. ఆయా వ్యక్తుల వ్యాఖ్యలను తప్పుపట్టడం మాత్రమే పనిగా పెట్టుకుంటే అని నిలదీసింది రిచా ఛడ్డా.