Begin typing your search above and press return to search.

డైరెక్ట్ షకీల దగ్గరకు వెళ్లిందట!!

By:  Tupaki Desk   |   23 Jun 2018 1:30 AM GMT
డైరెక్ట్ షకీల దగ్గరకు వెళ్లిందట!!
X
1990 లలో మలయాళంలో సూపర్ స్టార్స్ ఎవరో అందరికి తెలిసే ఉంటుంది. మోహన్ లాల్ - మమ్ముంటి వంటి అగ్ర నటులు వారి సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఒక్కరి సినిమా వస్తే మాత్రం మలయాళం హీరోలు నిర్మాతలు బయపడాల్సిందే. లేదా రిలీజ్ తేదీని వాయిదా వేసుకోవాలి. షకీలా బీ గ్రేడ్ సినిమాలో అప్పట్లో ఒక సంచలనం. ఆమె సినిమా వచ్చింది అంటే చాలు రికార్డులు బద్దలయ్యేవి.

అయితే ఆమె జీవితంలో విజయాలకంటే ఒడిదుడుకులే ఎక్కువ. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆర్థికంగా వెనుకబడిపోయింది. ఇప్పుడు కన్నడలో అలాగే హిందీలో ఒకేసారి ఆమె బయోపిక్ ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. రిచా చద్దా షకీలా పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఆమె జీవితం గురించి తెలుసుకోవడానికి డైరెక్ట్ రీచా షకీలాను కలిసిందట. ఆమె జీవితంలో కొన్ని అనుభవాలను డైరెక్ట్ గా అడిగి తెలుసుకున్నట్లు ఆమె తెలిపింది.

ఆమె జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. సినిమాటిక్ లో ఎంతో డ్రామా ఉంది. అలాగే సినిమాలకు నిజ జీవితానికి చాలా తేడా ఉంది. ఆమె బయోపిక్ ఇప్పుడు రావడమే కరెక్ట్ అని షకీలా పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను అని రిచా వివరించింది. ఇక సినిమాను డైరెక్ట్ గా హిందీ - కన్నడలో తెరకెక్కించి మిగతా భాషల్లో డబ్ చేయనున్నారు. మరి ఆ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.