పూర్తిగా షకీలా ఆవహించిన రిచా చద్దా!

Wed Mar 13 2019 22:05:02 GMT+0530 (IST)

ఈ జెనరేషన్ లో ఇండియన్ ఆడియన్స్ కు సన్నీ లియోన్ పేరు ఎంత పరిచయమ ఆమెకు ఎంత క్రేజ్ ఉందో.. ఓ రెండు దశాబ్దాల క్రితం షకీలాకు సౌత్ లో అదే రేంజ్ క్రేజ్ ఉండేది.  అందుకే షకీలా బయోపిక్ పై చాలామందికి ఆసక్తి నెలకొంది.  ఒకవేళ ఈ జెనరేషన్ ఆడియన్స్ లో కొందరికి ఆమె పేరు తెలియకపోయినా సిల్క్ స్మిత బయోపిక్ 'డర్టీ పిక్చర్'  స్టైల్ లో 'షకీలా' కూడా అందరికీ ఆమె జీవితాన్ని పరిచయం చేయడం ఖాయమే.  ఈ సినిమాలో షకీలా పాత్రలో బాలీవుడ్ నటి రిచా చద్దా నటిస్తోందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోస్ లో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది.రిచా చద్దా మెయిన్  స్ట్రీమ్ బాలీవుడ్ సినిమాల్లో నటించినా అవి దాదాపుగా ఆఫ్ బీట్ స్టైల్ లో ఉంటాయి.  'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 1 & 2'.. 'ఫక్రే'.. 'సరబ్జీత్'.. ఇలా ఉంటుంది లిస్టు. అంతే కాదు ఇతర బాలీవుడ్ బ్యూటీల మాదిరిగా ఊరికే గ్లామర్ ఒలకబోసే రకం కాదు. కానీ రీసెంట్ గా మాత్రం హాటుగా కనిపించి అందరి మతులు పోగొట్టింది.  ఒక ప్రింటెడ్ టాప్ ధరించిన రిచా బటన్లు వేసుకోకుండా వదిలేసి తన అందాలను ఆరబోసింది. క్లీవేజ్ షో చేసేందుకే ఈ ఫోటోకు పోజు ఇచ్చిందని వెంటనే అర్థం అయిపోతుంది కదా.  ఈ ఫోటో చూస్తుంటే 'షకీలా' సినిమాలో ఆమె ఒలికించబోయే అందాలకు ఇది జస్ట్ శాంపిల్ ఏమో అన్నట్టుగా ఉంది.

గతంలో విద్యాబాలన్ కు 'డర్టీ పిక్చర్' తో పెద్ద బ్రేక్ వచ్చి స్టార్ అయినట్టుగా 'షకీలా' విషయంలో సీన్ రిపీట్ అయ్యి రిచాకు బ్రేక్ వస్తుందేమో వేచి చూడాలి.   అప్పటివరకూ ఈ గ్లామరస్ సర్జికల్ స్ట్రైక్స్ కొనసాగుతూ ఉంటాయని వేరే చెప్పాలా?