హాఫ్ గాళ్ ఫ్రెండ్ కోసం సగం డ్రెస్ లో

Fri May 19 2017 16:42:52 GMT+0530 (IST)

టాలీవుడ్ తూనీగ రియా చక్రవర్తి అరంగేట్రం తెలుగులో చేసినా.. ఆ తర్వాత మాత్రం తన మకాం ముంబైకి మార్చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ సౌత్ వైపు కన్నెత్తి చూడలేదు ఈ భామ. రియా తొలి సినిమా నిరుత్సాహపరచడంతో టాలీవుడ్ జనాలు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు.

బాలీవుడ్ లో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలనే చేస్తున్న రియా చక్రవర్తి నటించిన లేటెస్ట్ మూవీ హాఫ్ గాళ్ ఫ్రెండ్ ఇవాళే థియేటర్లలోకి వచ్చింది. అర్జున్ కపూర్.. శ్రద్ధా కపూర్ నటించిన ఈ మూవీలో రియా పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఇవాళ ఈ హాఫ్ గాళ్ ఫ్రెండ్ రిలీజ్ సందర్భంగా.. ముందు రోజున స్పెషళ్ ప్రీమియర్ ను ప్రదర్శించారు. హాఫ్ గాళ్ ఫ్రెండ్ ప్రీమియర్ కు సగం డ్రెస్సే వేసుకొచ్చిందా అనే టైపులో రెడీ అయిపోయి వచ్చేసింది రియా చక్రవర్తి. వైట్ అండ్ డ్రెసింగ్ కావడంతో మెరుపులు మామూలుగా లేవు.

వన్ సైడ్ స్లీవ్ తో భుజాల అందాల నుంచి బోలెడన్ని సొగసులు చూపించేసింది. మోకాళ్లకు మరీ పైవరకూ వెళ్లిపోయిన డ్రెస్ లో రియా చక్రవర్తి తెగ మెరిసిపోయింది. హాఫ్ గాళ్ ఫ్రెండ్ కాకుండా అమ్మడి చేతిలో బ్యాంక్ చోర్ అనే మూవీ కూడా ఉంది. అందులే రియా లీడ్ హీరోయిన్ కావడం విశేషంగా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/