తెర వెనుక అందాలకో సెల్ఫీ శోభ

Thu May 18 2017 12:20:00 GMT+0530 (IST)

సెల్ఫి వచ్చింది.. పరువాలకు పండగ తెచ్చింది అన్నట్టుగా ఉంది ఇప్పటి భామల వాలకం. ప్రపంచానికి వాళ్ళు చూపించాలని భావించే విషయాలను సినిమాలు ద్వారానే కాకుండా.. సోషల్ మీడియా సాధనాల ద్వారా కూడా చెబుతున్నారు. అందంతో ప్రయోగాలు చేస్తూ వారి ఫాన్స్ ను ఊరిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.

రియా చక్రవర్తి తెలుగులో ‘తూనీగ తూనీగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. దాని తరువాత బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అవకాశాలు ఆశించినట్లుగా రాకపోవడంతో.. ఇప్పుడు తన వంపులను సొంపుగా చూపే పనిలో పడింది. అందం నాది ఆనందం మీది అన్నట్టు ఊరిస్తోంది. ఈ వయ్యారికి ఇప్పుడు సినిమాలు పెద్దగా లేవు. ఇప్పుడు వేసవి కాలం కావడంతో.. బీచ్ కి వెళ్ళి సాగర తీరంలో సెల్ఫీతో సోయగాలు చూపిస్తోంది. ముద్దుగా ఉన్నావ్ అన్నవాళ్లకు ఇదే నా సమాధానం ఇప్పుడైనా నేను సెక్సీగా ఉన్నానో లేదో చెప్పండి అని నిలదీస్తున్నట్లుగా ఉంది.

సహజంగా హీరోయిన్లు గ్లామర్ రోల్ ఇస్తే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కావాలంటారు. గ్లామర్ సినిమాల్లో అవకాశాలొస్తే నేను ఆటబొమ్మనా అంటారు. ఈ బికినీ భామ ఇప్పుడు తన అందం అభినయం రెండూ ఉన్న పాత్రలు కోసం ఆరాటపడుతున్నట్లుగా ఉంది. అందుకే ఇలా తన సొగసులతో అందరిమీదకు బాణాలు విసురుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/