ఫోటో స్టోరీ: బికినీలో చిక్కిన తూనీగ!

Fri Aug 10 2018 16:33:31 GMT+0530 (IST)

రెక్కలు విచ్చిన తూనీగ ఫ్యూయల్ నింపిన విమానంలా రయ్ మని ఎగిరిపోకుండా ఇలా బికినీలో చిక్కడమేంటి? అంటారా? అయితే కాస్త వివరంగా లోతుల్లోకి వెళ్లాల్సిందే.`తూనీగ తూనీగ` సినిమాలో సుమంత్ అశ్విన్ సరసన కథానాయికగా నటించింది రియా చక్రవర్తి. ఆ సినిమా తర్వాత తెలుగులో వేరొక సినిమా చేయలేదు. మేరి డాడ్ కి మారుతి - సోనాలి కేబుల్ - హాఫ్ గాళ్ ఫ్రెండ్ - దొబారా - బ్యాంక్ చోర్ చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది `జలేబి` అనే చిత్రంలోనూ నటిస్తోంది. మొత్తానికి ఆరేళ్ల కెరీర్ లో ఈ అమ్మడు చేసింది కేవలం అరడజను సినిమాలే. అంటే ఏడాదికి యావరేజ్గా ఓ సినిమా చేస్తోంది. అయితే పెద్ద తెరపై అవకాశాలు లేకపోతేనేం..?  వాణిజ్య ప్రకటనల్లో ఇబ్బడి ముబ్బడిగానే అవకాశాలు అందుకుంటోంది. ఇంతకుముందు సోప్ యాడ్స్ - కోలా యాడ్స్లో పాపులరైన ఈ బ్యూటీ మోడలింగ్ రంగంలో బాగానే రాణిస్తోంది.

రియా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంది. వీలున్నంత వరకూ ఇన్ స్టాలో వేడెక్కించే ఫోటోలతో యూత్ కి టచ్ లోనే ఉంటోంది. ఇదిగో ఈ లుక్ చూస్తుంటే డర్టీ గాళ్ అప్పియరెన్స్ వేడెక్కించడం లేదూ? చెదిరిపోయిన జుత్తు.. వాలిపోయిన కళ్లు తెగ మత్తెక్కిపోతూ అప్పుడే మైకం నుంచి బయటకు వచ్చినట్టు కనిపించడం లేదూ? అద్గదే ఈ అమ్మడి ప్రత్యేకత. ఆ మత్తుకే కుర్రకారు చిత్తయిపోతున్నారు. ప్రస్తుత సన్నివేశం చూస్తుంటే రియా మరోసారి సౌత్ లో ఛాన్సుల కోసం వేట సాగిస్తోందని అర్థమవుతోంది. బాలీవుడ్ లో వీలు కుదరకపోతే ఇటువైపు నాలుగు పరిశ్రమలు అవకాశాలిచ్చేందుకు ఎప్పుడూ రెడీగానే ఉంటాయి. అయితే ఇక్కడ ఆడేందుకు ఉపయోగించే ఫార్ములానే కొన్నిటిని డిసైడ్ చేస్తుంది. ఎవ్వెరి డాగ్ హాజ్ ఏ డే.. ఆ డే ఈ అమ్మడికి ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.