Begin typing your search above and press return to search.

ప్రభాస్ కాదు.. రానాయే నచ్చాడు

By:  Tupaki Desk   |   24 July 2017 8:13 AM GMT
ప్రభాస్ కాదు.. రానాయే నచ్చాడు
X
బాహుబలి ఘన విజయం తర్వాత ప్రభాస్ పేరు మార్మోగిపోయింది. దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు వచ్చేసింది. అతడి నటన అద్భుతమంటూ ప్రశంసల జల్లు కురిపించారు. బాలీవుడ్ హీరోలు రణ్ బీర్ కపూర్ - వరుణ్ ధావన్ - అక్షయ్ కుమార్ తోపాటు మరికొందరు ఆ సినిమాలో ప్రభాస్ తెగ నచ్చేశాడంటూ కాంప్లిమెంట్ ఇచ్చేశారు.

కానీ అదే బాలీవుడ్ హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి ప్రభాస్ కన్నా విలన్ గా నటించిన రానాయే నచ్చాడంటూ చెబుతున్నారు. తాజాగా తూనీగ తూనీగ ఫేం హీరోయిన్ రియా చక్రవర్తి కూడా రానాకే ఓటేసింది. బాహుబలిలో రానా యాక్టింగ్ నచ్చిందంటూ చెప్పుకొచ్చింది. ఎందుకలా అంటే రానా తనకు మంచి ఫ్రెండ్ కాబట్టి అతడి నటనే నచ్చిందని చెప్పింది. తూనీగ తూనీగ తర్వాత బాలీవుడ్ కు ఎగిరిపోయిన భామ అక్కడ రెండు, మూడు సినిమాలు చేసింది. తిరిగి మరోసారి తెలుగులో పేరు తెచ్చుకోవాలని చూస్తోంది. టాలీవుడ్ లో రానా తనకు మంచి ఫ్రెండ్ అంటోంది. ఈమే కాదు... ప్రభాస్ - రానాల పక్కన నటిస్తారంటూ హీరోయిన్ ఆలియా భట్ ను అడిగితే తడుముకోకుండా రానా పేరు చెప్పింది. టాప్ హీరోయిన్ దీపికా పదుకునే కూడా రానా తన బెస్ట్ ఫ్రెండంటూ చెప్పింది.

రానా తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. దీపికా పదుకునే హిట్ సినిమా యే జవానీ హై దీవానీలో కామియో రోల్ కూడా చేశాడు. అతడు చేసే రోల్స్ కన్నా అతడు అక్కడి నటులతో మెయిన్ టెయిన్ చేస్తున్న రిలేషన్ ఎక్కువ కావడం విశేషం. అందుకే చిన్న హీరోయిన్ నుంచి టాప్ హీరోయిన్ వరకు అందరూ రానాయే తమ నెం. 1 యారీ అనేస్తున్నారు.