Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బికినీ బీచ్‌ లో స్పైసీ గాళ్‌

By:  Tupaki Desk   |   17 Nov 2018 10:34 AM GMT
ఫోటో స్టోరీ: బికినీ బీచ్‌ లో స్పైసీ గాళ్‌
X
ఇదివ‌ర‌కూ ఫిజీ దీవుల్లో ఇలియానా బికినీ విన్యాసాలు ఎంత వేడెక్కించాయో.. అంత‌కుమించి రియా చ‌క్ర‌వ‌ర్తి మాల్దీవుల ట్రిప్ స‌క్సెసైంది. ఇన్‌ స్టాలో ఈ అమ్మ‌డి బికినీ ఫోటోల‌కు ఫాలోయింగ్ ఏర్ప‌డింది. గ‌త వారం రోజులుగా రియా ఒంట‌రి దీవుల్లో విలాసాల్లో మునిగి తేలుతోంది. ఫుల్ గా బీచ్‌ లో విహ‌రిస్తూ నిరంత‌ర ఫోటోషూట్ల‌తో వేడెక్కించే బికినీ వ‌య్యారాల్ని సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా షేర్ చేస్తోంది. ఈ ఫోటోలు అంతే జోరుగా బోయ్స్ ట్విట్ట‌ర్‌ - ఇన్‌ స్టాలో షేర్ అవుతున్నాయి.

రియా కెరీర్ ప్ర‌స్తుతం డైలెమ్మాలో ఉంది. ఈ స‌న్నివేశం నుంచి త‌న‌ని తాను బ‌య‌ట‌ప‌డేసేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. అందులో భాగ‌మే ఈ ఫోటోషూట్లు. అప్ప‌ట్లో జ‌లేబి సినిమాలో న‌టించిన త‌ర్వాత మ‌ళ్లీ వేరొక చిత్రానికి సంత‌కం చేయ‌లేదు. నిర్మాత మ‌హేష్ భ‌ట్‌ తో ఎఫైర్ సైతం ఈ భామ‌కు కొత్త అవ‌కాశాల్ని తేలేక‌పోతోంది. ఓవ‌రాల్ గా రియా కెరీర్ జీరో అయిపోయింది. అందుకే ఇప్పుడిలా ఒంట‌రి దీవుల్లో బికినీల‌తో చెల‌రేగిపోతోంద‌న్న కామెంట్లు యూత్ నుంచి వినిపిస్తున్నాయి.

రియా సౌత్‌కి ప‌రిచ‌యం అయినా ఇక్క‌డా ద‌ర్శ‌క‌నిర్మాత‌లెవ‌రూ అవ‌కాశాలివ్వ‌క‌పోవ‌డంతో పూర్తిగా మోడ‌లింగ్ కెరీర్ వ‌ర‌కూ ప‌రిమితం అయిపోతోంది. లైఫ్‌ని ట‌ర్న్ తిప్పే ఆ ఒక్క ఛాన్స్ కోస‌మే వెయిటింగ్. మ‌రి ఆ ఒక్క ఛాన్స్ ఎవ‌రిస్తార‌న్న‌ది వేచి చూడాలి.