Begin typing your search above and press return to search.

అందుకే సుమ యాంకరింగ్ చేయలేదా??

By:  Tupaki Desk   |   25 Aug 2016 5:30 PM GMT
అందుకే సుమ యాంకరింగ్ చేయలేదా??
X
నిజానికి ఈ మధ్యన ఎటువంటి మెగా ఈవెంట్ అయినా కూడా యాంకరింగ్ అంతా సుమ చేతుల్లోనే పెట్టేస్తున్నారు. పైగా సుమ ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తున్న షోలలో కూడా మెగా హీరోలు బాగానే పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్‌ సుమకే తొలిసారి స్పెషల్ ఇంటర్యూ ఇచ్చాడు. సుమ ప్రోగ్రామ్స్ లో దాదాపు మెగా హీరోలందరూ పాల్గొంటారు. కాని అటువంటి సుమ.. మొన్న శిల్పకళావేదికలో చిరంజీవి 61వ బర్త్ డే సెలబ్రేషన్లకు మాత్రం యాంకరింగ్ చేయలేదు. వై సో?

ఆ కార్యక్రమానికి సుమతో యాంకరింగ్ కావాలనే చేయించలేదు అని తెలుస్తోంది. ఎందుకంటే అది ఫ్యాన్స్ చేస్తున్న బర్త్ డే వేడుక అని రామ్ చరణ్ చెప్పకనే చెప్పాడు. జరిగేది ఫ్యాన్స్ పేరుతోనే కాని ఖర్చంతా మెగా కాంపౌండ్ నుండే వెళుతోందని అందరికీ తెలుసు. కాకపోతే మరీ ఖరీదైన యాంకర్ సుమను పిలిస్తే.. ఖచ్చితంగా అందరికీ ఆ సీక్రెట్ లీక్ అయిపోతుంది కాబట్టి.. మనోళ్ళు శ్యామలతో సరిపెట్టేశారని తెలుస్తోంది. అయితే సుమ యాంకరింగ్ చేసిందా చేయలేదా అనేది కూడా పెద్ద న్యూసేనా అనుకునే జనాలు కూడా ఉన్నారు.

ప్రస్తుతం సుమకు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. అసలు ఆవిడ యాంకరింగ్ చేయాల్సిందే.. లేకపోతే ఆ ప్రోగ్రామ్ కు విలువేలేదు అనేంతగా పరిస్థితి మారిపోయింది. కాబట్టి సుమ చేసిందా చేయలేదా అనే విషయంపై డిస్కషన్లు తప్పవు మరి.