Begin typing your search above and press return to search.

అనసూయ కన్నా ముందే జూనియర్ ఎంట్రీ

By:  Tupaki Desk   |   3 Aug 2015 7:43 PM GMT
అనసూయ కన్నా ముందే జూనియర్ ఎంట్రీ
X
జబర్ధస్త్‌ ని సుదీర్ఘ కాలం నడిపించిన యాంకర్‌ రేష్మి. ఇప్పటికీ ఈ భామ యాంకర్‌ గా కొనసాగుతూ టీవీక్షకుల్లో యువతరాన్ని ఉర్రూతలూగిస్తోంది. అయితే ఈ భామకంటే ముందే అనసూయ జబర్ధస్త్‌ లో మెరుపులా మెరిసింది. అనసూయ యాంకరింగ్‌ కొనసాగించినంత కాలం కార్యక్రమంలో ఓ ఊపు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. కారణం ఏదైనా కొంత కాలం తర్వాత జబర్ధస్త్‌ నుంచి అనసూయ వైదొలగింది. ఇక ఆమె జూనియర్ గా వచ్చిన రేష్మి సుస్థిరంగా కొనసాగుతోంది.

అయితే ఈ ఇద్దరు భామలు.. ఇప్పుడు వెండితెరపై వెలుగులు విరజిమ్మడానికి వస్తున్నారు. పోటా పోటీగా ఈ భామలు కథానాయికలుగా మెరవడానికి రెడీ అవుతున్నారు. అనసూయ కథానాయికగా నటిస్తోందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఓ మహిళా ప్రధాన స్క్రిప్టు లో నాయికగా నటిస్తోంది. త్వరలోనే వివరాలు వెల్లడి కానున్నాయి. అలాగే రేష్మి గౌతమ్‌ ఇప్పటికే తమిళంలో ఓ చిత్రంలో నటించింది. కానీ అది కేవలం ఐటెమ్‌ మాత్రమేనని తర్వాత తెలిసింది. తెలుగులో వేరొక సినిమా ఆన్‌ సెట్స్‌ ఉంది. పూర్తి నాయికగా గుంటూర్‌ టాకీస్‌ చిత్రంలో నటిస్తోంది.

ఎల్బీడబ్ల్యూ ఫేం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాధ్యమైనంత తొందర్లోనే ఈ సినిమా థియేటర్ల లోకి రాబోతోంది. అంటే రేష్మి నటించిన సినిమానే ముందుగా వచ్చేస్తోందన్నమాట! రేసులో అనసూయ కాస్త వెనకబడింది. లేటెగా వచ్చినా లేటెస్టుగా వస్తుందేమో.. కాస్త వేచి చూడాల్సిందే.