కమలం బరిలో మరో తార

Sat Jul 14 2018 21:46:24 GMT+0530 (IST)

సినీ నటులు రాజకీయాలలోకి రావడం కొత్తేమీ కాదు ఈ కోవాలోకి రేష్మా రాథోడ్ కూడా చేరారు. హైదారాబాద్ వాసి అయిన రేష్మా తెలుగు - తమిళ్ - మలయాళ సినిమాలలో నటించారు. "ఈ రోజుల్లో " సినిమాతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. రేష్మా రాథోడ్ గత ఏప్రిల్లో బిజేపిలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే ఆమె పార్టీ యువజన విభాగం కార్యదర్శి పదవినిచ్చింది. తనకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించు కుంటానని - తనను యువజన విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు చాల సంతోషంగా ఉందని అన్నారు. అన్నీ కలసి వచ్చి - దేవుడి దయ ఉంటే తాను భారతీయ జనతా పార్టీ నుంచి  మహబూబాబాద్ లోక్ సభ స్దానానికి పోటీ చేస్తానని అన్నారు. పార్టీ ఎంపిక చేసీన నియోజకవర్గాలల్లో  పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని రేష్మా రాథోడ్ అన్నారు.అన్ని రంగాల్లో టిఆర్ ఎస్ విఫలం.. బిజెపి నేత ఎండల మరోవైపు బీజేపి నాయకుడు ఎండల లక్ష్మి  నారాయణ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనివారం ఆయనవిలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యిందని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు - హారితహారం వంటి పధాకలు ఏవీ కూడా అమలు కావడం  లేదని అన్నారు. హరితహారం కార్యక్రమాన్ని గ్రామ కార్యదర్శులకు అప్పగించి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు.జమిలి ఎన్నికలకు సిద్దపడుతున్న టిఆర్ ఎస్ పార్టీ డబుల్  బెడ్రూమ్ ఇళ్లను కట్టించడంలో ఎందుకు జాప్యం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం  2121 కోట్లు విడుదల చేసిందని అందులో తెలంగాణ ప్రభుత్వం 800 కోట్టు కూడా ఖర్చుచేయలేదని ఆయన అన్నారు.