Begin typing your search above and press return to search.

ఈ రోజుల్లో అయినా పట్టించుకుంటారా!!

By:  Tupaki Desk   |   21 Oct 2016 10:06 AM GMT
ఈ రోజుల్లో అయినా పట్టించుకుంటారా!!
X
ఈమెను గుర్తు పట్టారా.. ఈ రోజుల్లో మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన రేష్మా రాథోడ్. అంతకు ముందే బాడీగార్డ్ మూవీలో త్రిషకి ఫ్రెండ్ గా కూడా కనిపించింది. ఆ తర్వాత కూడా కొన్ని చిన్న సినిమాలు చేసినా క్రేజ్ రాకపోవడంతో.. తమిళ్-మలయాళ భాషల్లో కూడా ట్రయల్స్ వేసింది. అవి కూడా పెద్దగా ఫలితాలేమీ ఇవ్వలేదు.

ఈ తెలుగు బ్యూటీ మళ్లీ ఇప్పుడు తన ప్రయత్నాలు స్టార్ట్ చేసేసింది. ఆడియన్స్ కి తనను గుర్తు చేయడానికి.. ఇండస్ట్రీ జనాలకు తన ఉద్దేశ్యం చెప్పడానికి.. ఇలా ఫోటో షూట్స్ తో పలకరిస్తోంది. ఆకు పచ్చని డిజైనర్ వేర్ లో అందంగా కనిపించడమే కాదు.. కళ్లతో మాయ చేస్తూ.. పెదాలతో పిలుస్తూ ఊరించేస్తోంది రేష్మ. సోకుల విషయంలోను.. వాటి ప్రదర్శన విషయంలోనూ ముంబై భామలకు ఏ మాత్రం తగ్గనని ఇన్ డైరెక్టుగా చెబుతున్న ఈమెకు కావాల్సిందల్లా కాసింత ప్రోత్సాహం అంతే. ఇప్పటికే ఈ రోజుల్లో సినిమాతో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీకి.. ఇకపై అయినా కాస్త సపోర్ట్ వచ్చిందంటే.. తన ట్యాలెంట్ అంతా చూపించడం ఖాయమే.

తెలుగమ్మాయి అని పక్కన పెట్టేసే రోజులు ఈ మధ్య కాస్త తగ్గిపోయాయి. ఈ మధ్య కొత్తోళ్లయిన తెలుగమ్మాయిలను దూరం పెట్టడాన్ని మన దర్శక నిర్మాతలు తగ్గిస్తున్నారు. అదే ఊపులో రేష్మకు కూడా కాసిన్ని ఆఫర్స్ వస్తే.. తనేంటో ప్రూవ్ చేసేసుకోవడం ఖాయమే.