రేణుకు పవన్ అంటేనే పాజిటివ్!!

Thu Oct 12 2017 23:30:59 GMT+0530 (IST)

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే సిని ఫీల్డ్ లో కూడా ఆయనకు అభిమానులు చాలానే ఉన్నారు. సినిమాలకన్నా వ్యక్తిగతంగా ఎక్కువ అభిమానులు ఉన్న పవన్ పై అప్పుడపుడు కావాలని కొందరు కొన్ని విమర్శలు చేస్తూనే ఉన్నారు కానీ పవన్ మాత్రం వాటిపై స్పందించి ఇష్యు చేయడానికి ఇష్టపడడు.ఇక ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ పై ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయలేదు పైగా ఆయన ప్రస్తావన వచ్చిన ప్రతి సారి ఆమె పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యింది. అయితే రీసెంట్ గా మరోసారి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ పై పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆమె కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. ప్రస్తుతం ఆమె నీతోనే అనే డ్యాన్స్ షో లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే షోలో ఒక పార్టీసిపెంట్ బద్రి సినిమాలోని పాటకు డ్యాన్స్ చేశాడు. ఈ సందర్భంగా జడ్జిగా ఉన్న రేణు దేశాయ్ ఎటువంటి కామెంట్స్ చేస్తారా అని ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. అయితే ఆమె ఎవరు ఉహించని విధంగా పవన్ కళ్యాణ్ చేసినట్లుగా అస్సలు చేయలేదని ఆయన చేసినదాంట్లో పది శాతం పర్సెంటేజ్ కూడా నీ పర్ఫామెన్స్ లో కనిపించలేదని చెప్పడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అంతే కాకుండా ఆమె పవన్ స్టైల్ చాలా ప్రత్యేకమని ఓ రేంజ్ లో పొగిడేసింది. దీంతో పవన్ ని పొగిడే క్రమంలో రేణు దేశాయ్ డ్యాన్సర్ ని చాలా తక్కువ చేసి మాట్లాడిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా రేణు దేశాయ్ మాత్రం పవన్ ని చాలా పాజిటివ్ గా చూస్తోంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు.