Begin typing your search above and press return to search.

రేణు కి.. ఆ ప్రైవ‌సీ దొర‌క్క‌ట్లేద‌ట‌

By:  Tupaki Desk   |   22 Jun 2018 6:13 AM GMT
రేణు కి.. ఆ ప్రైవ‌సీ దొర‌క్క‌ట్లేద‌ట‌
X
పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో బంధం తెగిన త‌ర్వాత ఒంట‌రిగా ఉండిపోయిన రేణు దేశాయ్.. తాను మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెప్ప‌టం తెలిసిందే. ఈ మ‌ధ్య‌నే ఒక వ్య‌క్తి చేయి ప‌ట్టుకొని దిగిన చేతి ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టం ద్వారా.. తాను త్వ‌ర‌లోనే మ‌ళ్లీ పెళ్లి చేసుకునే విష‌యాన్ని చెప్పక‌నే చెప్పేశారు. తాజాగా..త‌న కాబోయే జీవిత భాగ‌స్వామి గురించి మ‌రిన్ని విష‌యాల్ని పంచుకున్నారు.

ప్ర‌స్తుతం పిల్ల‌లు.. ఫ్రెండ్స్ తో క‌లిసి గోవాలో ఉన్న రేణు.. త‌న స్నేహితులు త‌న కాబోయే భ‌ర్త పంపిన మేసేజ్ ల్ని చ‌దివే ప్రైవ‌సీని ఇవ్వ‌ట్లేద‌ని వెల్ల‌డించారు. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రేణు.. ఫోన్ చూస్తున్న‌ప్ప‌టి ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోను త‌న ఫ్రెండ్స్ తీసిన‌ట్లుగా చెప్పారు.

నీతో ఉంటే చాలా సంతోషంగా.. శాంతంగా ఉంటాను. నా చెయ్యి ప‌ట్టుకో.. ఎప్ప‌టికి విడ‌వ‌కు.. అవును.. ఆ న‌మ్మ‌కాన్ని నువ్వు నాకు క‌ల్పించావంటూ ఈ మ‌ధ్య‌న మేసేజ్ చేసిన రేణు.. తాజాగా త‌న కాబోయే భ‌ర్త పంపిన మేసేజ్ లు చ‌దివే ప్రైవ‌సీ కూడా లేద‌ని చెప్ప‌టం ద్వారా..త‌న రెండో పెళ్లికి సంబంధించి అంద‌రిని ప్రిప్రేర్ చేస్తున్న‌ట్లుగా భావిస్తున్నారు. మొత్తానికి రేణు రెండో పెళ్లి భాజాలు త్వ‌ర‌లోనే మోగనున్న విష‌యాన్ని తాజా మెసేజ్ తో చెప్పిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.