Begin typing your search above and press return to search.

రేణుదేశాయ్‌కి న‌చ్చిన ప‌వ‌న్ ఫొటో ఇదే

By:  Tupaki Desk   |   29 Aug 2016 7:08 AM GMT
రేణుదేశాయ్‌కి న‌చ్చిన ప‌వ‌న్ ఫొటో ఇదే
X
విడిపోయార‌న్న మాటే కానీ... ప‌వ‌న్‌ - రేణుదేశాయ్‌ల ఒక‌రిపై మ‌రొక‌రు ప్రేమ కురిపించుకొంటూనే ఉన్నారు. ప‌వ‌న్ మీడియాతో ఇంటరాక్ట్ అయిన‌ప్పుడంతా ఏదో ఒక విష‌యంలో రేణుదేశాయ్ పేరును ప్ర‌స్తావిస్తూనే ఉంటాడు. ఇక రేణుదేశాయ్ అయితే ట్విట్ట‌ర్‌ లో త‌ర‌చుగా ప‌వ‌న్ నామ‌స్మ‌ర‌ణ చేస్తూ ఉంటుంది. ప‌వ‌న్‌ గారు అంటూ ఆయ‌న్ని ఎంతో గౌర‌వంగా సంబోధిస్తూ ఉంటుంది. దీన్నిబ‌ట్టి డైవ‌ర్స్ అయిన‌ప్ప‌టికీ ఆ ఇద్ద‌రూ ఎంతో అన్యోన్యంగా ఉన్నార‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంది. సెప్టెంబ‌రు 2న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు. ఆ రోజుని ప‌వ‌న్ అభిమానులు ఓ పండ‌గ‌లా జ‌రుపుకొంటారు.

ఆన్‌ లైన్‌ లోనూ - బ‌య‌టా పెద్ద‌యెత్తున సంద‌డి చేస్తుంటారు. ఆ సంబ‌రాల‌కి రేణుదేశాయ్ ముందే తెర‌తీసింది. తాను 2010లో తీసిన ఓ ఫొటోని ట్విట్ట‌ర్‌ లో షేర్ చేస్తూ ఫ్యాన్సంతా ఈ ఫొటోని కామ‌న్ డీపీగా పెట్టేసుకోవ‌చ్చ‌ని చెప్పేసింది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఆ ఫొటోని చాలామంది డీపీగా పెట్టేసుకోవ‌డం ఇప్ప‌టికే మొదలుపెట్టారు. ఆ ఫొటో గురించి ఇంకా రేణుదేశాయ్ చెబుతూ ``ప‌వ‌న్‌ గారి క‌ళ్ల‌ల్లో ఇంటెన్సిటీని బ‌య‌టికి చెబుతున్న ఈ ఫొటో అంటే నాకు చాలా ఇష్టం. 2010లో నేను కొన్ని నికాన్ డి5 కెమెరాతో క్లిక్ చేశా. స్కిన్ టోన్ కూడా స‌హ‌జమైన‌దే. నేనేమీ మార్చింది కాదు`` అంటూ త‌న మాజీ భ‌ర్త స‌హ‌జ‌మైన అంద‌గాడ‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పింది రేణుదేశాయ్‌. గ‌తేడాది పుట్టిన‌రోజుకి కూడా ప‌వ‌న్ ఫొటోని ఇలాగే షేర్ చేసింది రేణు. ఆ ఇద్ద‌రి అన్యోన్య‌త‌ని చూస్తూ ఇంత‌మంచి జంట విడిపోవ‌డ‌మెందుకో అని మాట్లాడుకొంటున్నారు స‌గ‌టు జ‌నాలు.