బద్రి నాటి బాధను చెప్పిన మాజీ వైఫ్

Thu Apr 20 2017 22:21:55 GMT+0530 (IST)

బద్రి.. టాలీవుడ్ కి కొన్ని కొత్త మూమెంట్స్ ను.. ఫీలింగ్స్ ను పరిచయం చేసిన మూవీ ఇది. పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్- అమీషా పటేల్ నటించిన ఈ మూవీ.. పవన్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో బద్రి కూడా ఒకటి. అలాగే ఈ సినిమా నుంచి పవన్- రేణు దేశాయ్ ల మధ్య సాన్నిహిత్యం మొదలైంది కూడా. అదే తర్వాత పెళ్లికి దారి తీసింది.

అలాంటి బద్రి రిలీజ్ అయ్యి.. ఏప్రిల్ 20తో 17 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే.. బద్రి మూవీ మాత్రం తనకు ఓ చేదు జ్ఞాపకం అంటోంది రేణు దేశాయ్. 17 ఏళ్ల క్రితం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ ఫోన్ వచ్చిందట. దాని సారాంశం ఏంటంటే.. రేణు బెస్ట్ ఫ్రెండ్ యాక్సిడెంట్ లో మరణించిందని చెప్పారట. అంతే.. అస్సలు ఏడుపు ఆపుకోలేకపోయిందట రేణూ దేశాయ్. కానీ షూటింగ్ స్పాట్ నుంచి అప్పటికప్పుడు వెళ్లిపోయే అవకాశం లేక.. ఏడుస్తూనే షూటింగ్ చేశానని చెప్పింది రేణూ.

పాట షూటింగ్ చేస్తుండగా.. ఆ పాటలోని ఓ సన్నివేశంలో తన కళ్ల నిండా నీళ్లు ఉన్న ఓ ఫోటోను కూడా చూపించి.. ఆనాటి బాధను గుర్తు చేసుకుంది రేణు దేశాయ్. అప్పటి బాధకు ఇప్పటికీ తన కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉంటాయన్న ఆమె.. తన స్నేహితురాలి గుర్తుగా.. ఓ కవితను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/