Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ను పొగుడుతూ.. బాలయ్యకు పంచ్

By:  Tupaki Desk   |   20 Nov 2017 8:04 AM GMT
ఎన్టీఆర్ ను పొగుడుతూ.. బాలయ్యకు పంచ్
X
మెగా ఫ్యామిలీ హీరోల గురించి నందమూరి క్యాంప్ వాళ్లు పొగిడితే.. నందమూరి హీరోల గురించి మెగా ఫ్యామిలీ వాళ్లు పొగిడినా అందరూ ఆశ్చర్యంగా.. ఆసక్తిగా చూస్తారు. ఈ రెడు ఫ్యామిలీల మధ్య ఉండే పోటీ అలాంటిది. హీరోల మధ్య కాకపోయినా.. రెండు వర్గాల అభిమానుల మధ్య అంతరాలు ఉన్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు పొగిడితే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. నందమూరి కథానాయకుడు జూనియర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇలాగే ఆశ్చర్యపరుస్తున్నాయి. రేణు మాటీవీలో ప్రసారమయ్యే ‘నీతోనే డ్యాన్స్’ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్టీఆర్ పాటకు ఒకరు డ్యాన్స్ చేశారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడింది రేణు.

ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్సర్ అని.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని బెస్ట్ డ్యాన్సర్లలో అతనొకడని రేణు కితాబిచ్చింది. ఎంత కష్టమైన స్టెప్పులైనప్పటికీ ఎన్టీఆర్ చేస్తుంటే చాలా ఈజీగా.. అందంగా అనిపిస్తాయని.. అది అతడి స్పెషాలిటీ అని రేణు పేర్కొంది. నటన విషయంలోనూ ఎన్టీఆర్ మీద రేణు ప్రశంసలు కురిపించింది. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలు చేయడంలో ఎన్టీఆరే బెస్ట్ అని రేణు కితాబివ్వడం విశేషం. ఐతే ప్రస్తుత నటుల్లో పౌరాణిక పాత్రలు చేయడంలో తాను తప్ప మరో ప్రత్యామ్నాయమే లేదని తనకు తాను కితాబు ఇచ్చుకుంటుంటాడు నందమూరి బాలకృష్ణ. కానీ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలు చేయడంలో ఎన్టీఆరే బెస్ట్ అనడం ద్వారా రేణు.. బాలయ్యకు పరోక్షంగా ఒక పంచ్ ఇచ్చినట్లయింది.