రేణు మళ్లీ దాచేసింది

Sat Jul 14 2018 11:14:00 GMT+0530 (IST)

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఎవరిని పెళ్లాడబోతోందో తెలుసుకోవాలన్న ఉత్సుకత జనాల్లో కనిపిస్తోంది. కానీ రేణు మాత్రం అతనెవరో రివీల్ చేయడానికి ఇష్టపడట్లేదు. గత నెలలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న రేణు.. ఆ సందర్భంలో తనకు కాబోయే వాడి ముఖం చూపించకుండా ఎంగేజ్మెంట్ దృశ్యాన్ని మాత్రమే పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో జనాలు ఎంతగా అడుగుతున్నా ఆ వ్యక్తి ఫొటోను పంచుకోవట్లేదు. ఈలోపు రేణు మూడేళ్ల కిందట తన సోదరుడి పెళ్లిలో అతడితో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలోకి తెచ్చేసి అతనే కాబోయే భర్త అంటూ ప్రచారం చేశారు కొందరు. అప్పుడు కూడా రేణు స్పందించలేదు. తనకు కాబోయే భర్తను పరిచయం చేయలేదు.తాజాగా రేణు దేశాయ్ మరో దాగుడుమూతల ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రేణు.. అక్కడి నుంచే తనకు కాబోయే భర్తతో ఒక ఫొటో దిగింది. అందులోనూ ఆ వ్యక్తి ముఖం దాచేసింది. రేణు రెండో పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో చాలా ట్రోల్ ఎదుర్కొంది రేణు. ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ట్రోలింగ్ తట్టుకోలేక పవన్ మీద రివర్సులో ఎటాక్ కూడా మొదలుపెట్టింది. పవన్ తనతో కలిసి ఉండగానే మరో మహిళతో సంబంధం పెట్టుకుని బిడ్డను కన్న విషయాన్ని ప్రస్తావించింది. దీనిపై పెద్ద చర్చ నడుస్తున్న సమయంలోనే తనకు కాబోయే భర్త ముఖాన్ని దాచేస్తూ మరో ఫొటోను రిలీజ్ చేసింది రేణు. మరి ఆమె ఎప్పుడో ఆ వ్యక్తిని బయటి ప్రపంచానికి పరిచయం చేస్తుందో చూడాలి.