Begin typing your search above and press return to search.

జ్ఞాప‌కాల క‌విత‌తో గుండె పిండేసిన రేణు

By:  Tupaki Desk   |   23 Feb 2018 5:24 AM GMT
జ్ఞాప‌కాల క‌విత‌తో గుండె పిండేసిన రేణు
X
మ‌న‌సు మీద ప‌డే ముద్ర‌లు కొన్ని అంత తేలిగ్గా పోవు. కొంద‌రిని ఒక‌లా చూసే అభిమానం.. వారి పాలిట ఎంత శాపంగా మారుతుందో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ స‌తీమ‌ణి రేణు దేశాయ్ ను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అధికారికంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య‌గా రేణు మారిపోయిన‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ అభిమానుల‌కు మాత్రం ఇప్ప‌టికి వ‌దిన‌మ్మ‌గా మిగిలిపోయింది. ఆ అభిమానం ఇప్పుడామె స్వేచ్ఛ‌కు సంకెళ్లుగా మారింది.

మూడో పెళ్లితో ప‌వ‌న్ త‌న‌దైన జీవితాన్ని తాను జీవించేస్తుంటే.. రేణు మాత్రం అందుకు భిన్నంగా జ్ఞాప‌కాల బందీఖానాలో జీవిస్తున్నార‌ని చెప్పాలి. మ‌రో పెళ్లి చేసేసుకొని.. మ‌రో ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రిగా ప‌వ‌న్ ప్ర‌మోష‌న్ పొందితే.. రేణు మాత్రం త‌న ఇద్ద‌రి పిల్ల‌లే ప్ర‌పంచంగా బ‌తుకుతోంది.

సినిమాల్లో ఎంట్రీ.. అంత‌లోనే సంచ‌ల‌న విజ‌యాలు.. ఆ వెంట‌నే ప‌వ‌న్ తో స‌హ‌జీవ‌నం.. పిల్ల‌లు.. పెళ్లి.. ఇలా చిత్ర విచిత్రంగా సాగుతున్న రేణు జీవితంలో విడాకుల ప‌ర్వం రావ‌టం.. ఆమె తీవ్ర ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని ఎదుర్కోవ‌టం తెలిసిందే. ఒంట‌రిగా ఉండ‌టం ఎంత క‌ష్ట‌మో.. ప్రాక్టిక‌ల్ గా అదెంత ప్రాబ్ల‌మ్ అన్న‌ది తాను తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు చోటు చేసుకున్న ఉదంతాల గురించి ఆమె చెబితే.. అయ్యో పాపం అన‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి.

అదే స‌మ‌యంలో ప‌వ‌న్ మాజీ స‌తీమ‌ణిగా సంకెళ్లు వేసి.. ఆమె స్వేచ్ఛ‌కు అభిమాన బంధీఖానాలో ఉంచేస్తున్న వైనం కొంద‌రు త‌ప్పు ప‌డుతున్నా.. రేణు విష‌యంలో ప‌వ‌న్ అభిమానులు మాత్రం వెన‌క్కి త‌గ్గ‌టం లేదు.

మొత్తంగా గ‌త‌మ‌నే జ్ఞాప‌కాల్లో బ‌తికేస్తున్న ఆమె తాజాగా మ‌న‌సులోని భావాల‌కు అక్ష‌ర రూపం ఇచ్చారు. ఒక చిట్టి వీడియోలో త‌న భావోద్వేగాన్ని పంచుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆవేద‌న‌తో కూడిన ఆమె భావోద్వేగం ప‌వ‌న్ అభిమానుల్ని మాత్ర‌మే కాదు.. అంద‌రి మ‌న‌సుల్ని ట‌చ్ చేసేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ట‌చ్చింగ్ గా ఉన్న ఆమె జ్ఞాప‌కాల వీడియోను ఆమె షేర్ చేశారు. అందులో ఏముందంటే..

‘‘నా జ్ఞాప‌కాల‌న్నింటినీ చూసుకుంటున్నాను. ఆయ‌న మాట‌లు - ప‌దాలు - ఆయ‌న పేరు చెక్కిన క‌లం నా జ్ఞాప‌కాల్లో ఉన్నాయి.క‌మ్ముకున్న హిమం క‌రిగిపోయి మ‌ళ్లీ ఆ జ్ఞాప‌కాలు క‌ళ్లెదుట నిలిచాయి. విధి ఎంత బ‌లీయమైనది. మ‌న‌సు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాప‌కాలన్నింటినీ మ‌ళ్లీ తట్టిలేపింది" "ఆ జ్ఞాప‌కాల్ని తిరిగి చూసుకుంటే తుప్పు ప‌ట్టిన క‌లం - దానిపై రాసుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయాయి. ముక్క‌లైన హృద‌యం, నేను రాసుకున్న లేఖల కాగిత‌పు ముక్క‌లు క‌న్పించాయి’’ అంటూ రేణు త‌న చిట్టి క‌విత‌తో గుండెలు పించేసింది. అయితే.. ఆమె రాసుకున్న జ్ఞాప‌కాలన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించేన‌న్న వ్యాఖ్య‌ను ప‌లువురు చేస్తున్నారు. ఆమె పోస్ట్ చేసిన పొట్టి వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.