Begin typing your search above and press return to search.

పుస్తకాల మార్కింగ్ లో రేణూ స్పెషాలిటీ

By:  Tupaki Desk   |   29 Nov 2015 10:30 PM GMT
పుస్తకాల మార్కింగ్ లో రేణూ స్పెషాలిటీ
X
బుక్ రీడింగ్ చాలా మందికి ఇష్టం. ఇంతకంటే స్పెషల్ బుక్ కీపింగ్. కొన్న పుస్తకాలను పదిలంగా దాచుకుంటారు కొంతమంది. అయితే.. తాము కొన్న ప్రతీ బుక్ కి ప్రత్యేకత ఆపాదించేవాళ్లు తక్కువగానే ఉంటారు. అలాంటివారిలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి.

ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే రేణూ.. రీసెంట్ గా ఓ ట్వీట్ చేసింది. ఓ పిక్ ని షేర్ చేస్తూ.. "నేను నా పుస్తకాలను మార్కింగ్ చేసే విధానం ఇది. ఇలా చేయడంతో వాటిని మళ్లీ చదివేటప్పుడు అప్పటి జ్ఞాపకాలు మళ్లీ గుర్తొస్తాయి" అని రాసింది రేణు దేశాయ్. ఈ ట్వీట్ తో పాటే ఆ పుస్తకాన్ని, తను దానిపై రాసుకున్న అప్పటి రాతలను కూడా ఫోటో తీసి సోషల్ నెట్వర్క్ లో పెట్టింది రేణూ దేశాయ్.

తన సంతకం, కొన్న ప్లేస్ కి గుర్తుగా చెన్నై, ఎక్కడ కొన్నానో గుర్తు కోసం ల్యాండ్ మార్క్ అని రాసుకుంది రేణు. అంతే కాదు.. తను పుస్తకం కొన్న డేట్ తో పాటు.. కొమరం పులి షూటింగ్ టైంలో అని కూడా మెన్షన్ చేసుకుంది. ఇంతకీ ఆ బుక్ పేరేంటో తెలుసా.. త్రూ ఏ గ్లాస్., డార్క్ లీ. ఇప్పుడా బుక్ ని ఓపెన్ చేస్తే.. అప్పుడు పవన్ తో కలిసి చెన్నైలో చక్కర్లు కొట్టిన సంగతులు గుర్తుకొస్తున్నాయని ఇన్ డైరెక్టుగా చెప్పింది రేణూ దేశాయ్.