మేము సైతం అంటున్న వదినమ్మ

Mon Apr 16 2018 16:45:11 GMT+0530 (IST)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ని ఆయన అభిమానులందరూ వదినమ్మా... అని ప్రేమగా పిలుస్తుంటారు. పవన్ తో విడిపోయిన తర్వాత కొడుకు అకీరా నందన్- కూతురు ఆద్యాల బాధ్యతను చూసుకుంటున్న రేణు దేశాయ్... తెలుగులో ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ కి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రేణు దేశాయ్... పవన్ కల్యాణ్ గర్వపడే పనిచేసిందని మురిసిపోతున్నారు ఆయన అభిమానులు.
తాజాగా ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన రేణుదేశాయ్ తాను త్వరలో మంచు లక్ష్మీ నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమంలో పాల్గొనట్టు చెప్పింది. లైవ్ లో మంచు లక్ష్మీతో కలిసి అభిమానులతో ముచ్ఛటించింది. దివ్యజ్యోతి ఫౌండేషన్ కోసం పని చేశాననీ... ఇలాంటి మంచి కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది రేణు. ఈ ఫౌండేషన్ నుంచి 35 మంది పిల్లలు ఈ షోకి వస్తున్నారని... అందరూ చూడాలని ఈ షోని తప్పకుండా చూడాలని చెప్పింది. పేద పిల్లలకు మంచి చేసే ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ పాలుపంచుకోవాలని... సాటివారి కోసం సాధ్యమైనంత సహాయం చేస్తే అందరూ బాగుంటారని చెప్పింది రేణు దేశాయ్.

మంచు లక్ష్మీ మేము సైతం కార్యక్రమం ద్వారా చేస్తున్న సేవను కొనియాడింది రేణు దేశాయ్. ఈ లైవ్ లో రేణుతో పాటు మంచు లక్ష్మీ కూడా కనిపించి మాట్లాడడం విశేషం. రేణు ఈ లైవ్ లో పూర్తిగా తెలుగులోనే మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.రేణుదేశాయ్ దర్శకురాలిగా- రచయితగా- నిర్మాతగా మారి ‘ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠీ సినిమా తీసిన విషయం తెలిసిందే.