Begin typing your search above and press return to search.

టాలీవుడ్లో వాయిదాల పర్వం

By:  Tupaki Desk   |   26 May 2018 5:30 PM GMT
టాలీవుడ్లో వాయిదాల పర్వం
X
టాలీవుడ్లో కొత్త సినిమాల వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ముందు హడావుడిగా డేట్ ఇవ్వడం.. ఆ తర్వాత చేతులెత్తేయడం కామన్ అయిపోతోందీ మధ్య. ఇప్పటికే ఈ నెలలో రావాల్సిన అరడజను సినిమాలు వాయిదా పడ్డాయి. వీటిలో కొన్ని వచ్చే నెలకు షెడ్యూల్ అయ్యాయి. కానీ మే ముగిసి జూన్ నెల మొదలు కాబోతున్న తరుణంలో మళ్లీ వాయిదా వార్తలు మొదలయ్యాయి. మే 25 నుంచి జూన్ 1కి వాయిదా పడిన నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘నా నువ్వే’ వాయిదా పడిపోయింది. సెన్సార్ కూడా అయి విడుదలకు అంతా సిద్ధమైన సమయంలో ఆ చిత్రాన్ని మళ్లీ ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆ చిత్ర కొత్త రిలీజ్ డేట్ ఈ రోజే ప్రకటించారు. జూన్ 14న ఈ ‘నా నువ్వే’ ప్రేక్షకుల ముందుకొస్తుందట.

మరోవైపు జూన్ ఫిబ్రవరి 9.. మే 11.. అంటూ డేట్లు మార్చుకుంటూ వెళ్లి చివరికి జూన్ 14కు ఫిక్సయిన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ఆ తేదీకి కూడా రావట్లేదని సమాచారం. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్లే వాయిదా అని అంటున్నారు. జులైలో ‘సాక్ష్యం’ ప్రేక్షకుల ముందుకొస్తుందట. మరోవైపు జూన్ 1న ‘ఆఫీసర్’ రావడంపైనా అయోమయం నెలకొంది. ఈ చిత్రానికి వేరే లీగల్ తలనొప్పులు కొన్ని ఉన్నాయి. కాబట్టి రిలీజ్ పక్కా అనుకోలేం. మరోవైపు జూన్ 1నే రావాల్సిన ‘రాజుగాడు’ విషయంలోనూ సందిగ్ధత కొనసాగుతోంది. పోటీని బట్టి ఆ రోజు సినిమాను రిలీజ్ చేద్దామా వాయిదా వేద్దామా అని చూస్తున్నారు. జూన్ రెండో వారంలో ‘కాలా’ - ‘జురాసిక్ వరల్డ్’ రాబోతుండగా.. 14వ తేదీకి ‘టాక్సీవాలా’ - ‘సమ్మోహనం’ షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటికిప్పుడు ‘నా నువ్వే’ తోడైంది. మరి ఒకే రోజు మూడూ వస్తాయా అంటే సందేహమే. ఒక్కటైనా రేసు నుంచి తప్పుకుంటుందని భావిస్తున్నారు.