20 ఏళ్ల తర్వాత మళ్ళీ లైవ్ లో..

Thu Jun 14 2018 09:47:31 GMT+0530 (IST)

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమా చేసి హీరోయిన్ గా కొన్నాళ్ళు బాలీవుడ్లో రాణించి తనకంటూ ఒక ప్రత్యేకతను అలానే బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది రేఖ. సినిమాలకు ఒక 3 ఏళ్లుగా దూరంగా ఉంటున్న ఈమె మళ్ళీ తిరిగి 20 ఏళ్ల తర్వాత ఒక స్టేజి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) ఈవెంట్ లో రేఖ లైవ్ లో నృత్యం చేయబోతోంది. ఈ విషయాన్ని బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు. "ఇప్పటిదాకా ఆమె యాక్టింగ్ చూశాను. ఇప్పుడు లైవ్ చూడబోతున్నా అనేది నాకు చాలా పెద్ద విషయం" అంటూ గౌరవనీయంగా స్టేజి పైకి రేఖను ఆహ్వానించాడు. ఇంతకీ ఏ పాటలను పెర్ఫామ్ చేయబోతున్నారు అని అడుగగా "నాకు మరో పేరు మిస్టరీ. ఇప్పుడే చెప్పేస్తే ఇంకా మిస్టరీ ఏముంటుంది?" అంటూ ధీటుగా సమధానమిచ్చింది.

రన్బీర్ కపూర్ షాహిద్ కపూర్ అర్జున్ కపూర్ బాబీ డియోల్ కృతి సనన్ మొదలైన సెలబ్రిటీ లు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. కరణ్ జోహార్ మరియు రితేష్ దేశముఖ్ ఈ ఈవెంట్ ను హోస్ట్ చేయబోతున్నారు. నెక్స ఐఫా అవార్డ్స్ ను బ్యాంకాక్ లోని సియాం నిరమిట్ థియేటర్ లో జూన్ 22 నుండి 24 వరకు నిర్వహించనున్నారు.