Begin typing your search above and press return to search.

ఆనందం పాప ఇంకా ట్రై చేస్తోందిగా

By:  Tupaki Desk   |   28 Aug 2016 4:14 AM GMT
ఆనందం పాప ఇంకా ట్రై చేస్తోందిగా
X
రేఖా వేదవ్యాస్ అంటే ఠకీమని గుర్తొస్తుందో లేదో చెప్పలేం కానీ.. ఆనందం మూవీలో హీరో ఆకాష్ ని నానా తిట్లు తిట్టి రచ్చ చేసిన భామ అంటే మాత్రం చాలామందికి ఈ భామ గుర్తొస్తుంది. ఆనందంతో వచ్చిన క్రేజ్ ని సరిగా క్యాష్ చేసుకోలేకపోయిన ఈ భామ.. మెల్లగా తెలుగు తెరకు దూరమైపోయింది. వరుసగా తెలుగు సినిమాలు చేసింది కానీ.. ఇక్కడ కంటే ఎక్కువగా కన్నడ జనాలే ఆమెను ఆదరించేసరికి మెల్లగా బేస్ అక్కడకి మార్చేసింది.

రేఖ చివరగా తెలుగులో కనిపించిన సినిమా జీనియస్. అది కూడా స్పెషల్ అప్పియరెన్స్ మాత్రమే. మరోవైపు కన్నడ ఇండస్ట్రీలో కూడా రెండేళ్ల క్రితం ఆఫర్లు ఆగిపోయాయి. ఇప్పుడు మొత్తం కాల్షీట్స్ అంతా ఖాళీయే. అందుకే అటు తెలుగుకు.. ఇటు సౌత్ లో ఇతర భాషలకు ఒకేసారి వల వేసేందుకు సిద్ధమైన రేఖ.. వెంటనే ఫోటో షూట్ పెట్టేసింది. పద్ధతిగా కనిపించేయాలని పెద్దగా హద్దులేమీ లేవని ఇండికేట్ చేసేందుకు.. గ్లామర్ బాగానే ఒలకబోసింది.

తన స్కిన్ కలర్ కి మ్యాచ్ అయ్యేలా.. లైట్ పింక్ డ్రెసింగ్ లో కొద్దికొద్దిగా క్లీవేజ్ ని కూడా చూపించింది. కురచ డ్రస్సులతో తన ఫిగర్ ని చూపించింది. మరి ఇంకా ఆనందం రేఖలో అందాలు దాగున్నాయని నమ్మి.. డైరెక్టర్లు ఛాన్సులిచ్చేస్తారంటారా?